Regional Parties : 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు.. ప్రాంతీయ పార్టీలకే పట్టం

దేశం మొత్తం ఆసక్తిగా ఎదురు చూసిన నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతం అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చేశాయి. ఎగ్జిట్ పోల్స్ అంచనాలే నిజమయ్యాయి. ఓటర్లు ప్రాంతీయ పార్టీలకే పట్టం కట్టారు. జాతీయ పార్టీలను తిరస్కరించారు. పశ్చిమ బెంగాల్‌, కేరళ, తమిళనాడు, అస్సాం రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరికి వేర్వేరు విడతల్లో ఎన్నికలు జరిగాయి. అలాగే తెలుగు రాష్ట్రాల్లోని తిరుపతి పార్లమెంటు, నాగార్జున

Regional Parties : 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు.. ప్రాంతీయ పార్టీలకే పట్టం

Regional Parties

Regional Parties : దేశం మొత్తం ఆసక్తిగా ఎదురు చూసిన నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతం అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చేశాయి. ఎగ్జిట్ పోల్స్ అంచనాలే నిజమయ్యాయి. ఓటర్లు ప్రాంతీయ పార్టీలకే పట్టం కట్టారు. జాతీయ పార్టీలను తిరస్కరించారు. పశ్చిమ బెంగాల్‌, కేరళ, తమిళనాడు, అస్సాం రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరికి వేర్వేరు విడతల్లో ఎన్నికలు జరిగాయి. అలాగే తెలుగు రాష్ట్రాల్లోని తిరుపతి పార్లమెంటు, నాగార్జున సాగర్ అసెంబ్లీ స్థానాలకు ఉపఎన్నికలు జరిగాయి. వాటి ఫలితాలు నేడు(మే 2,2021) వెలువడ్డాయి. ఈ ఫలితాల్లో ప్రాంతీయ పార్టీల హవా స్పష్టంగా కనిపించింది. ఓటర్లు రీజనల్ పార్టీల వైపే మొగ్గుచూపారు.

బెంగాల్ లో మమతా బెనర్జీ సారథ్యంలోని ప్రాంతీయ పార్టీ అయిన తృణమూల్ కాంగ్రెస్ హ్యాట్రిక్ విక్టరీ కొట్టింది. వరుసగా మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. తమిళనాడులో స్టాలిన్ నాయకత్వంలోని డీఎంకే కూటమి అఖండ విజయం సాధించింది. పదేళ తర్వాత తమిళనాడులో అధికార మార్పిడి జరిగింది. కేరళలోనూ ప్రాంతీయ పార్టీదే హవా. ప్రభుత్వ ఏర్పాటు దిశగా ఎల్డీఎఫ్ పయనిస్తోంది. కేరళలో గత 40 ఏళ్లుగా ఎల్డీఎఫ్‌, యూడీఎఫ్ లు ఒకదాని తర్వాత ఒకటి అధికారంలోకి వస్తున్నాయి. ఏ ప్రభుత్వం వరుసగా రెండోసారి అధికారంలోకి రాలేదు. కానీ, మొదటిసారి ఈ ఒరవడిని తిరగరాసి పినరాయి విజయన్‌ నాయకత్వంలో ఎల్డీఎఫ్ చరిత్ర సృష్టించింది. కేరళలో 140 స్ధానాలకు గాను పాలక ఎల్డీఎఫ్‌ 89 స్ధానాల్లో, యూడీఎఫ్‌ 44 స్ధానాల్లో ఆధిక్యం కనబరుస్తున్నాయి.

ఇక ఏపీలోని తిరుపతి పార్లమెంటుకి జరిగిన ఉపఎన్నికలోనూ ప్రాంతీయ పార్టీ హవా స్పష్టంగా కనిపించింది. ఇక్కడ జాతీయ పార్టీల ప్రభావం ఎంతమాత్రమూ లేదు. అధికార వైసీపీ భారీ ఆధిక్యంతో ఘన విజయం సాధించింది. అటు తెలంగాణలోని నాగార్జున సాగర్ అసెంబ్లీ ఉపఎన్నిక ఫలితాల్లోనూ ప్రాంతీయ పార్టీకే ప్రజలు పట్టం కట్టారు. సాగర్ లో టీఆర్ఎస్ అభ్యర్థి భారీ ఆధిక్యంతో గెలుపు దిశగా సాగుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ కు పెద్దగా ఆదరణ లభించలేదనే చెప్పాలి.