అమర్ నాథ్ యాత్రకు రిజిస్ట్రేషన్స్ ప్రారంభం

అమర్ నాథ్ యాత్రకు రిజిస్ట్రేషన్స్ ప్రారంభం

Amarnath Yatra 2021

కరోనా కారణంగా 2020లో అమర్‌నాథ్ యాత్రను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకోగా.. ఈ ఏడాది యాత్రను ప్రారంభించేందుకు దేవస్థానం బోర్డు సిద్ధమైంది. ఈ మేరకు గురువారం(01 ఏప్రిల్ 2021) నుంచి యాత్ర రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభించనుంది. కరోనా కారణంగా నిబంధనలు అమలు చేస్తున్నారు దేవస్థానం వారు. 13 ఏళ్ల లోపు పిల్లలు 75 ఏళ్ళు పైబడిన వృద్ధులను అనుమతించబోమని తెలిపింది.

రెండేళ్ల తర్వాత యాత్ర జరుగుతుండటంతో ఈ ఏడాది భక్తుల రద్దీ అధికంగా ఉంటుందని భావిస్తున్నారు అమర్ నాథ్ దేవస్థానం బోర్డు అధికారులు. ఆరు లక్షల మంది వరకు మంచు శివలింగాన్ని దర్శించుకునే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. సముద్ర మట్టానికి 3,880 మీటర్ల ఎత్తులో దక్షిణ కాశ్మీర్‌లో ఉన్న మంచులింగాన్ని దర్శించుకునేందుకు ప్రతి ఏడు లక్షలమంది వెళ్తుంటారు.

రిజిస్ట్రేషన్ వివరాల్లోకి వెళితే:

దేశవ్యాప్తంగా 446 పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌, జమ్మూకాశ్మీర్‌ బ్యాంక్‌, యస్‌ బ్యాంక్‌ శాఖల్లో యాత్ర రిజిస్ట్రేషన్‌కు అధికారులు అవకాశం ఇచ్చారు. ఈ బ్యాంకు శాఖల వివరాలు www.shriamarnathjishrine.com అందుబాటులో ఉన్నాయని వెల్లడించింది. మార్చి 15 తర్వాత మంజూరు చేసిన ధ్రువపత్రాలు మాత్రమే చెల్లుతాయని స్పష్టం చేశారు. ఈ యాత్ర 56 రోజులపాటు సాగుతుంది. ఈ సారి బాల్తాల్‌, చందన్వారీ ప్రారంభం అవుతుంది. ఈ వివరాలను బోర్డు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ నితీశ్వర్ కుమార్ తెలిపారు.

తెలంగాణలో ఆరు బ్యాంకులలో రిజిస్ట్రేషన్:
అమర్‌నాథ్ యాత్ర రిజిస్ట్రేషన్ కోసం తెలంగాణలో ఆరు బ్యాంకులు, ఏపీలో ఆరు బ్యాంకులలో ఏర్పాట్లు చేశారు. తెలంగాణలో కరీంనగర్, సంగారెడ్డి, సిద్ధిపేట, సికింద్రాబాద్ లో హిమాయత్ సాగర్ లో గత పీఎన్‌బీ బ్యాంకులతోపాటు జమ్మూకాశ్మీర్‌ బ్యాంకు శాఖల్లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.

ఆంధ్రప్రదేశ్‌లో..
ఆంధ్రప్రదేశ్ లో కృష్ణా, గుంటూరు చిత్తూరు, కడప, నెల్లూరు, విశాఖపట్నంలోని పంజాబ్ నేషనల్‌ బ్యాంకు శాఖల్లో రిజిస్ట్రేషన్‌ చేసుకునే వీలు కల్పించారు. గురువారం నుంచి రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చని తెలిపారు అమర్ నాథ్ దేవాలయం అధికారులు.