International Flights : అంతర్జాతీయ విమాన సర్వీసులపై నిషేధం పొడిగింపు

అంతర్జాతీయ విమాన సర్వీసులపై ఉన్న నిషేధాన్ని మరోమారు డీజీసీఏ పొడిగించింది. కరోనా కొత్త వేరియంట్ "ఒమిక్రాన్" నేపథ్యంలో జనవరి-31,2020 వ‌ర‌కు అంత‌ర్జాతీయ విమాన స‌ర్వీసుల‌పై నిషేధాన్ని

International Flights :  అంతర్జాతీయ విమాన సర్వీసులపై నిషేధం పొడిగింపు

Flights

International Flights: అంతర్జాతీయ విమాన సర్వీసులపై ఉన్న నిషేధాన్ని మరోమారు డీజీసీఏ పొడిగించింది. కరోనా కొత్త వేరియంట్ “ఒమిక్రాన్” నేపథ్యంలో జనవరి-31,2020 వ‌ర‌కు అంత‌ర్జాతీయ విమాన స‌ర్వీసుల‌పై నిషేధాన్ని పొడిగిస్తున్నట్లు గురువారం డీజీసీఏ జారీ చేసిన ఓ సర్క్యులర్ లో పేర్కొంది. అయితే, అంత‌ర్జాతీయ ర‌వాణా స‌ర్వీసుల‌కు వ‌ర్తించ‌ద‌ని డైరెక్ట‌రేట్ జ‌న‌ర‌ల్ ఆఫ్ సివిల్ ఏవియేష‌న్ (డీజీసీఏ) తెలిపింది.

ఇక, వివిధ దేశాల‌తో కుదుర్చుకున్న ఒప్పందాల మేర‌కు ప్ర‌త్యేక అంతర్జాతీయ ప్రయాణికుల విమాన స‌ర్వీసులు కొన‌సాగుతాయ‌ని తెలిపింది. అమెరికా, బ్రిటన్, యూఏఈ, ఫ్రాన్స్‌ సహా దాదాపు 32 దేశాల నుంచి ప్రత్యేక బయో బబుల్ ఏర్పాటు ప్రాతిపదికన విమానాలను నడుపేందుకు సంస్థలకు అనుమతినిచ్చింది.

క‌రోనా నేప‌థ్యంలో గ‌తేడాది మార్చి 23 నుంచి అంత‌ర్జాతీయ విమాన స‌ర్వీసుల‌ను భారత్​ నిలిపేసింది. అయితే.. 2020 మే నుంచి వందే భారత్ మిషన్ కింద, 2020 జులై నుంచి ఎయిర్ బబుల్ ఒప్పందంలో భాగంగా ఎంపిక చేసిన దేశాల నుంచి ద్వైపాక్షిక అంతర్జాతీయ విమానాలను అనుమతిస్తోంది.

ALSO READ Tributes : వీర జవాన్లకు నివాళులర్పించిన మోదీ,ఇతర ప్రముఖులు