PM Modi : ప్రధాని మోదీపై టీఆర్ఎస్ ఎంపీల సభా హక్కుల ఉల్లంఘన తీర్మానం తిరస్కరణ

తెలంగాణ ప్రజలను, తెలంగాణ ఏర్పాటును ప్రధాని అవమానించారంటూ టీఆర్ఎస్ ఎంపీలు ప్రివిలేజ్ మోషన్స్ ఇచ్చారు.

PM Modi : ప్రధాని మోదీపై టీఆర్ఎస్ ఎంపీల సభా హక్కుల ఉల్లంఘన తీర్మానం తిరస్కరణ

Pm Modi (1)

PM Modi : ప్రధాని మోదీపై టీఆర్ఎస్ ఎంపీల సభా హక్కుల ఉల్లంఘన తీర్మానం తిరస్కరణకు గురైంది. టీఆర్ఎస్ ఎంపీలు ఇచ్చిన ప్రివిలేజ్ మోషన్ ను రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడు తిరస్కరించారు. మొదటి విడత బడ్జెట్ సమావేశాల్లో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యావాదాలు తెలిపే తీర్మానానికి ప్రధాని మోదీ సమాధానం ఇచ్చారు.

ధన్యవాద తీర్మానానికి సమాధానంగా కాంగ్రెస్ పై విమర్శలు చేసిన సందర్భంలో తెలంగాణా ఏర్పాటు చేసిన తీరుపై మోదీ వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రజలను, తెలంగాణ ఏర్పాటును ప్రధాని అవమానించారంటూ టీఆర్ఎస్ ఎంపీలు ప్రివిలేజ్ మోషన్స్ ఇచ్చారు. గత నెల 10వ తేదీన ప్రధానిపై రాజ్యసభలో, లోక్ సభలో కే. కేశవరావు, నామా నాగేశ్వర్ రావు ప్రివిలేజ్ మోషన్స్ ఇచ్చారు.