Rekha Singh: భర్త కలను నెరవేర్చిన రేఖా సింగ్.. ఆర్మీలోకి ఎంట్రీ

రేఖాసింగ్ ఆర్మీలో అధికారిణిగా బాధ్యతలు నిర్వహించాలన్నది భర్త దీపిక్ సింగ్ కోరిక. ఈ విషయాన్ని రేఖాసింగ్ వద్ద చెబుతూ కలలు కనేవాడు. అయితే రేఖాసింగ్ మాత్రం టీచర్‌గా విద్యారంగానికే...

Rekha Singh: భర్త కలను నెరవేర్చిన రేఖా సింగ్.. ఆర్మీలోకి ఎంట్రీ

Rekha Singh

Rekha Singh: రేఖాసింగ్ ఆర్మీలో అధికారిణిగా బాధ్యతలు నిర్వహించాలన్నది భర్త దీపిక్ సింగ్ కోరిక. ఈ విషయాన్ని రేఖాసింగ్ వద్ద చెబుతూ కలలు కనేవాడు. అయితే రేఖాసింగ్ మాత్రం టీచర్‌గా విద్యారంగానికే పరిమితమైంది. మధ్యప్రదేశ్‌కు చెందిన దీపక్‌సింగ్ ఆర్మీలో పనిచేవాడు. 2020 జూన్‌లో గాల్వాన్ లోయలో చైనా సైనికులతో జరిగిన పోరాటంలో 20మంది భారత జవాన్లు అమరులైన సంగతి తెలిసిందే. చైనా సైనికులతో వీరోచితంగా పోరాడి అమరుడైన వారిలో దీపక్ సింగ్ కూడా ఒకరు. అయితే దీపక్ సింగ్ కన్నకలను ఆయన భార్య నెరవేర్చింది. దీపక్ సింగ్ ఆశయ సాధన కోసం సైన్యంలోకి అడుగు పెట్టింది.

దీపక్ వీరమరణం తర్వాత భర్త కలను ఎలాగైనా నెరవేర్చాలని రేఖాసింగ్ నిర్ణయించుకుంది. అందుకోసం ఆమె ఆర్మీ అధికారులను సంప్రదించింది. దీంతో వారుసైతం ఒకే చెప్పడంతో వారి మార్గనిర్దేశంతో నోయిడా వెళ్లి సైనిక ప్రవేశ పరీక్ష రాసింది. తొలిసారి పరీక్షలో రేఖా సింగ్ ఫెయిల్ అయింది. అయినా భర్త కలను నెరవేర్చడమే లక్ష్యంగా పెట్టుకున్న రేఖాసింగ్ పట్టు వదలకుండా రెండోసారి పరీక్షలు రాసి ఉత్తీర్ణత సాధించింది. దీంతో ఆర్మీలో ఆమె లెఫ్టినెంట్ హోదాను దక్కించుకుంది.

Indian Army: రెండు వందల మంది తీవ్రవాదులు చొరబాటుకు సిద్ధం: ఇండియన్ ఆర్మీ

రేఖాసింగ్‌కు ఈనెల 28 నుంచి ఆర్మీ శిక్ష ప్రారంభమవుతుంది. చెన్నైలో శిక్షణ ఉంటుందని రేఖా సింగ్ తెలిపారు. శిక్షణ పూర్తి అయిన తర్వాత సైన్యంలో చేరి దేశానికి సేవలందించనుంది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తన భర్తకు నేను ఆర్మీలో పనిచేయాలని ఎంతో కోరిక ఉండేదని, ఈ క్రమంలోనే తాను ఆర్మీలోకి అడుగు పెడుతున్నట్లు తెలిపారు. కానీ ఈ ఆనంద క్షణాలను పంచుకొనేందుకు ఆయన లేకపోవటం తీరని వేదనకు గురిచేస్తుందని పేర్కొంది.