Surgical Strike: సర్జికల్ స్ట్రైక్స్ నిజంగా చేసుంటే, వీడియో రిలీజ్ చేయండి.. కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు

పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కీలక నేత రాహుల్ గాంధీ సహా సీనియర్ నేతలంతా దిగ్విజయ్ వ్యాఖ్యలకు పూర్తి వ్యతిరేకంగా మాట్లాడారు. సైనికులను తాము ప్రశ్నించబోమని, వారిపై తమకు పూర్తి విశ్వాసం ఉందని అన్నారు. 2016లో జమ్మూ కశ్మీర్‭లోని ఉరిలోని 12 బ్రిగేడ్ కేంద్ర కార్యాలయంపై జరిగిన ఉగ్రదాడిలో 18 మంది జవాన్లు మరణించారు. అనంతరం, 10 రోజులకు పాకిస్తాన్ ప్రాంతంపై భారత సేనలు సర్జికల్ దాడులు చేశారు.

Surgical Strike: సర్జికల్ స్ట్రైక్స్ నిజంగా చేసుంటే, వీడియో రిలీజ్ చేయండి.. కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు

Release surgical strike video if you have it, says Congress’ Alvi; BJP demands resignation

Surgical Strike: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ చేసిన సర్జికల్స్ స్ట్రైక్స్ వ్యాఖ్యలు అధికార, విపక్షాల మధ్య రాజకీయ వివాదాన్ని రాజేస్తూనే ఉన్నాయి. ఆ వివాదం ఇంకా ముగియనే లేదు. కాంగ్రెస్ పార్టీకి చెందిన మరో నేత రషిద్ అల్వి ఇదే విషయమై మరింత ఘాటుగా స్పందించి, ఇప్పటికే కొనసాగుతున్న రాజకీయ వివాదానికి మరింత ఆజ్యం పోశారు. సర్జికల్ స్ట్రైక్స్ అనేది పెద్ద భూటమేనన్నట్లుగా ఆయన వ్యాఖ్యానించారు. నిజంగా అలాంటి దాడులే చేసి ఉంటే ఆధారాలు చూపించాలంటూ కేంద్ర ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు.

Donald Trump: నేనైతే ఒక్క రోజులోనే తేలిపోయేది.. రష్యా-ఉక్రెయిన్ యుద్ధంపై ట్రంప్

గురువారం ఆయన ఓ సందర్భంలో మాట్లాడుతూ ‘‘మన దేశ రక్షణ దళాలపై నాకు పూర్తి నమ్మకం ఉంది. కానీ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం మీద నమ్మకం లేదు. దిగ్విజయ్ సింగ్ అడిగిన దాంట్లో తప్పేం ఉంది? నిజంగా సర్జికల్ స్ట్రైక్స్ చేస్తే వీడియో చూపించడానికి అభ్యంతరం ఏంటి? మేమేం ఆధారాలు అడగడం లేదు. మాకు కనీసం ఒక వీడియో చూపిస్తే చాలు అంటున్నాం’’ అని అన్నారు. ఇంకా ఆయన మాట్లాడుతూ ‘‘సర్జికల్ స్ట్రైక్స్ మీద నేనేమీ అనుమానాల్ని వ్యక్తం చేయడం లేదు. కానీ అధికారంలో ఉన్నవారు ఎగరేస్తున్న భుజాల మీద నా అభ్యంతరం. దానికి వారు సమాధానం చెప్పాలి. అమిత్ షా ఒకలాగ చెప్పారు, యోగి మరోలా చెప్పారు. ఇంతకు ఏది నిజమనేది తెలియాలి’’ అని అల్వి అన్నారు.

Gautam Adani : భారీగా పడిపోయిన అదానీ గ్రూప్ షేర్లు.. ప్రపంచ కుబేరుల జాబితాలో ఏడో స్థానంకు అదానీ..

దీనికి కొద్ది రోజుల ముందు దిగ్విజయ్ సింగ్ మీడియాతో మాట్లాడుతూ ‘‘పుల్వామా దాడిలో 40 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. జవాన్లను హెలికాఫ్టర్ ద్వారా చేరవేయాలని సీఆర్‭పీఎఫ్ ముందుగానే ప్రధానమంత్రి నరేంద్రమోదీకి విజ్ణప్తి చేసింది. కానీ మోదీ ఇందుకు అంగీకరించలేదు. ఆ తర్వాత ఎలాంటి దారుణం జరిగిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇంత దారుణం జరిగిన ఏళ్లు గడుస్తున్నా దీనిపై ప్రభుత్వం ఒక్క రిపోర్టు కూడా పార్లమెంట్ ముందు సమర్పించలేకపోయింది. సర్జికల్ స్ట్రైక్స్ చేశామని ప్రభుత్వం చెప్పింది. కానీ దానికి ఆధారాలు కనిపించడం లేదు. అబద్ధాలు చెబుతూ ప్రజల్ని మోసగించారు’’ అని అన్నారు.

Pakistani rupee: భారీగా పతనమైన పాకిస్తాన్ రూపాయి… డాలర్‌కు 259కు పడిపోయిన కరెన్సీ

కాగా, దిగ్విజయ్ చేసిన వ్యాఖ్యాలతో పార్టీకి సంబంధం లేదని కాంగ్రెస్ పార్టీ పేర్కొంది. పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కీలక నేత రాహుల్ గాంధీ సహా సీనియర్ నేతలంతా దిగ్విజయ్ వ్యాఖ్యలకు పూర్తి వ్యతిరేకంగా మాట్లాడారు. సైనికులను తాము ప్రశ్నించబోమని, వారిపై తమకు పూర్తి విశ్వాసం ఉందని అన్నారు. 2016లో జమ్మూ కశ్మీర్‭లోని ఉరిలోని 12 బ్రిగేడ్ కేంద్ర కార్యాలయంపై జరిగిన ఉగ్రదాడిలో 18 మంది జవాన్లు మరణించారు. అనంతరం, 10 రోజులకు పాకిస్తాన్ ప్రాంతంపై భారత సేనలు సర్జికల్ దాడులు చేశారు.