కరోనా ఫైట్…PM కేర్స్ ఫండ్ కు 500కోట్లు విరాళమిచ్చిన రిలయన్స్

  • Published By: venkaiahnaidu ,Published On : March 30, 2020 / 03:50 PM IST
కరోనా ఫైట్…PM కేర్స్ ఫండ్ కు 500కోట్లు విరాళమిచ్చిన రిలయన్స్

కరోనాపై పోరాటంలో భాగంగాకేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల చర్యలకు తోడు తమ వంతు సాయం అందించేందుకు రిలయన్స్ ఇండస్ట్రీస్ ముందుకొచ్చింది. సోమవారం రిలయన్స్ ఇండస్ట్రీస్ (RIL) పీఎం-కేర్స్ ఫండ్‌కు రూ .500 కోట్లు విరాళంగా ఇస్తున్నట్లు తెలిపింది. అలాగే మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాలకు అదనంగా 5 కోట్ల రూపాయలు ఇస్తున్నట్లు కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. కరోనావైరస్ మహమ్మారికి వ్యతిరేకంగా దేశం చేస్తున్న పోరాటాన్ని బలోపేతం చేయడానికి PM-CARES నిధిని రూపొందించారు. ఈ నిధికి విరాళాలు ఇవ్వాలని ప్రధాని నరేంద్ర మోడీ ఇటీవల పౌరులకు విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే.

అంతేకాకుండా,భారతదేశపు మొట్టమొదటి 100 పడకల ప్రత్యేకమైన COVID-19 హాస్పిటల్ కరోనావైరస్ రోగుల చికిత్సకు కేవలం రెండు వారాల్లో సన్నద్ధం చేయనున్నట్లు రిలయన్స్ తెలిపింది. ముఖేష్ భార్య నీతా అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఫౌండేషన్ దేశవ్యాప్తంగా నిరుపేదలకు ఉచిత భోజనం అందిస్తామని హామీ ఇచ్చింది. అదనంగా, COVID-19 తో పోరాడుతున్న రోగుల కోసం తమకు చెందిన మొత్తం ఆసుపత్రిని కూడా విరాళంగా ఇచ్చారు అంబానీ.