Reliance Industries దూకుడు.. రికార్డు స్థాయికి షేర్ ధర, మార్కెట్ విలువ @ రూ.16.9 లక్షలు

Reliance Industries దూకుడు మీదుంది. దీని షేర్ ధర రికార్డు స్థాయికి చేరింది. దీంతో కంపెనీ మార్కెట్‌ విలువ రూ.16.9లక్షల కోట్లను తాకింది.

Reliance Industries దూకుడు.. రికార్డు స్థాయికి షేర్ ధర, మార్కెట్ విలువ @ రూ.16.9 లక్షలు

Reliance Industries

Reliance Industries : దేశీయ పారిశ్రామిక దిగ్గజం, మల్టినేషనల్ కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రీస్ దూకుడు మీదుంది. ఈ కంపెనీ షేర్ ధర రికార్డు స్థాయికి చేరింది. దీంతో కంపెనీ మార్కెట్‌ విలువ రూ.16.9లక్షల కోట్లను తాకింది. రిలయన్స్‌ షేరు జీవితకాల అత్యధికం రూ.2,510ని తాకింది. దాదాపు ఏడాది నుంచి ఈ కంపెనీ షేరు వరుసగా పెరుగుతూ వస్తోంది. ఏడాది కాలంలో ఈ కంపెనీ షేరు దాదాపుగా 25శాతం విలువ పెంచుకుంది.

రిలయన్స్‌ జియో డిజిటల్‌ ఎకో సిస్టమ్‌లో తిరుగులేని శక్తిగా ఎదగడం, రిలయన్స్ రిటైల్‌ వేగంగా నెట్‌వర్క్‌ను విస్తరించడం.. ఈ కారణాలతో షేరు ధర పెరుగుతోంది. కంపెనీ షేర్‌కు డిమాండ్‌ ఎక్కువై ట్రేడింగ్‌ వాల్యూమ్స్‌ కూడా పెరిగాయి. దీంతోపాటు కరోనా సమయంలో కూడా రిలయన్స్‌ విస్తరణ ఎక్కడా ఆగలేదు. వివిధ రంగాల్లోని కంపెనీలను కొనుగోలు చేస్తోంది. ఇటీవల గ్రీన్‌ ఎనర్జీ సెక్టార్‌లోకి కూడా అడుగుపెట్టింది.

Google Chrome వాడుతున్నారా? అయితే జాగ్రత్త.. వెంటనే ఈ పని చేయండి

ఆర్థిక వ్యవస్థ పూర్తిగా సాధారణ స్థాయికి వస్తుండటంతో రీటైల్‌, చమురు వ్యాపారం మళ్ల భారీగా పుంజుకోనుందనే నివేదికలు కొనుగోలుదార్లను ఉత్సాహపరుస్తోంది.

“రిలయన్స్ షేర్లు ఈరోజు రూ.2500 దగ్గర తాజా బ్రేక్ అవుట్ ఇచ్చాయి. తక్షణ స్వల్పకాలంలో ఒక్కొక్కటి రూ.2620 వరకు పెరగవచ్చు. ప్రస్తుత మార్కెట్ ధర దగ్గర రిలయన్స్ షేర్లను కొనుగోలు చేయవచ్చు” అని SMC గ్లోబల్ సెక్యూరిటీస్ సీనియర్ రీసెర్చ్ అనలిస్ట్ ముదిత్ గోయల్ అన్నారు.

దేశంలోనే టాప్ వాల్యుడ్ ఫర్మ్ ఎనర్జీ ప్రాజెక్టులను విస్తరించడానికి సంబంధించి సీఎండీ ముకేష్ అంబానీ చేసిన ప్రకటనలు షేర్ ధర పెరగడానికి కారణమని మార్కెట్ విశ్లేషకులు తెలిపారు.

Curry Leaves : కరివేపాకు కొలెస్టరాల్ ను తగ్గిస్తుందా..?

రిలయన్స్ షేర్ ధర పెరగడానికి కారణం..
“సోలార్ ఎనర్జీ ప్రాజెక్టులను విస్తరించేందుకు ముఖేష్ అంబానీ ఇటీవల ప్రకటన చేయడం రిలయన్స్ షేర్ల ధరలు పెరగడానికి తక్షణ కారణం. ఇది కాకుండా, రిలయన్స్ సౌదీ ఆరామ్‌కో ఒప్పందంలో కూడా తీవ్రమైన పురోగతి ఉంది. ఈ పరిణామాలతో రిలయన్స్ షేర్ల మార్కెట్ అత్యంత ఉత్సాహంగా ఉంది. జియోమార్ట్‌కు సంబంధించి మార్కెట్ కూడా అదే రకమైన ప్రకటనను ఆశిస్తోంది. ఏదేమైనా, ముడి చమురు ధరలు పెరగడం వలన రిలయన్స్ షేర్ ధరలో ర్యాలీని నిలిపివేయవచ్చు” అని ప్రాఫిట్ మార్ట్ సెక్యూరిటీస్ రీసెర్చ్ హెడ్ అవినాష్ గోరక్షర్ అన్నారు.

“రిలయన్స్ షేర్లు దూకుడు మీదున్నాయి. స్వల్పకాలిక స్టాక్ మార్కుకు రూ.2700 వరకు పెరగవచ్చు. కాబట్టి, కౌంటర్‌లో కొనుగోలు చేసే ప్రతి అవకాశాన్ని ఒకసారి చూడండి. రిలయన్స్ షేర్లు స్వల్పకాలిక లక్ష్యం కోసం రూ.2700, మధ్యకాలిక టార్గెట్ కోసం ప్రతి స్టాక్ స్థాయికి రూ.3వేల కోసం తమ హోల్డింగ్‌లను కొనసాగించాలి. అదే స్వల్పకాలిక, మధ్యకాలిక లక్ష్యాల కోసం స్టాక్‌ను కలిగి ఉండాలని” తాజా పెట్టుబడిదారులకు జీసీఎల్ సెక్యూరిటీస్ వైస్ చైర్మన్ రవి సింఘాల్ సూచించారు.