Buy One Get One Free… Jio యూజర్లకు అదిరిపోయే ఆఫర్

రిలయన్స్ జియో బంపర్ ఆఫర్ తెచ్చింది. జియో ఫోన్ యూజర్ల కోసం అదిరిపోయే ప్రీపెయిడ్ ప్లాన్స్ ప్రకటించింది. జియో ఫోన్ అన్ని ప్లాన్లకు బయ్ వన్ గెట్ వన్

Buy One Get One Free… Jio యూజర్లకు అదిరిపోయే ఆఫర్

Reliance Jio

Buy One Get One Free : జియో ఫోన్ యూజర్లకు రిలయన్స్ అదిరిపోయే ఆఫర్ ప్రకటించింది. జియో ఫోన్ అన్ని ప్రీపెయిడ్ ప్లాన్లకు బై వన్ గెట్ వన్ ఫ్రీ ఆఫర్ అనౌన్స్ చేసింది. అంటే, జియో ఫోన్ యూజర్లు అన్ని ప్లాన్లపై డబుల్ బెనిఫిట్స్ పొందుతారు. జియో ఫోన్ యూజర్ ఏదైనా ప్లాన్ తో రీచార్జ్ చేసుకుంటే, అంతే విలువ కలిగిన అదపసే రీచార్జి ఉచితంగా పొందుతారు. ఈ ఆఫర్ పరిమిత సమయం వరకే.

నార్మల్ ప్రీపెయిడ్ ప్లాన్ కు ఈ ఆఫర్ వర్తించదు. జియో బై వన్ గెట్ వన్ ఫ్రీ ఆఫర్ కేవలం ఆరు ప్రీ పెయిడ్ ప్లాన్స్ కు మాత్రమే వర్తిస్తుంది. మీరు రూ.75 ప్లాన్ తో రీచార్జి చేసుకుంటే, అదనంగా రూ.75 ప్లాన్ పూర్తి ఉచితంగా అందుతుంది. ప్రీపెయిడ్ ప్లాన్ కి ఏ ప్రయోజనాలు ఉంటాయో.. ఈ ఫ్రీ ప్లాన్ కి కూడా వర్తిస్తాయి.

* బయ్ వన్ ఆఫర్ ఏయే ప్లాన్లకు అంటే.. Rs 39, Rs 69, Rs 75, Rs 125, Rs 155, Rs 185

* రూ.39 రీచార్జి ప్లాన్..
అన్ లిమిటెడ్ వాయిస్ కాలింగ్
100ఎంబీ డేటా పర్ డే
14 రోజుల వాలిడిటీ
ఉచిత ఎస్ఎంఎస్ లు లేవు
బై వన్ గెట్ వన్ ఆఫర్ వల్ల రోజుకు 200ఎంబీ డేటా వస్తుంది. వాలిడిటీ 28 రోజుల వరకు పొడిగించబడుతుంది.

* రూ.69 ప్రీ పెయిడ్ ప్లాన్..
అన్ లిమిటెడ్ వాయిస్ కాలింగ్
0.5 జీబీ డేటా పర్ డే
14 రోజుల వాలిడిటీ
ఉచిత ఎస్ఎంఎస్ లు లేవు
బై వన్ గెట్ వన్ ఆఫర్ వల్ల రోజుకి 1జీబీ డేటా వస్తుంది. వాలిడిటీ 28 రోజుల వరకు పొడిగించబడుతుంది.

రూ.75 ప్రీపెయిడ్ ప్లాన్..
అన్ లిమిటెడ్ వాయిస్ కాలింగ్
3జీబీ డేటా
28 రోజుల వాలిడిటీ
బై వన్ గెట్ వన్ ఆఫర్ వల్ల ఈ ప్లాన్ తో రోజుకు 6జీబీ డేటా వస్తుంది.

రూ.125 ప్రీ పెయిడ్ ప్లాన్..
అన్ లిమిటెడ్ వాయిస్ కాలింగ్
0.5డేటా పర్ డే
28 రోజుల వాలిడిటీ
1జీబీ డేటా పర్ డే

రూ.155 ప్రీపెయిడ్ ప్లాన్..
అన్ లిమిటెడ్ వాయిస్ కాలింగ్
1జీబీ డేటా పర్ డే
28 రోజుల వాలిడిటీ
ఈ ప్లాన్ కొంటే 2జీబీ డేటా పర్ డే

రూ.185 ప్రీపెయిడ్ ప్లాన్..
అన్ లిమిటెడ్ వాయిస్ కాలింగ్
2జీబీ డేటా పర్ డే
28 రోజుల వాలిడిటీ
ఈ ప్లాన్ కొంటే రోజుకు 4జీబీ డేటా