రిలయన్స్ జియో VS ఎయిర్‌టెల్ VS వొడాఫోన్ ప్లాన్లు: రూ.500 కంటే తక్కువలో ఏది బెస్ట్ ప్లాన్?

రిలయన్స్ జియో VS ఎయిర్‌టెల్ VS వొడాఫోన్ ప్లాన్లు:  రూ.500 కంటే తక్కువలో ఏది బెస్ట్ ప్లాన్?

Reliance Jio: రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియాలు 2020లో స్టార్ట్ చేసిన కొత్త ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్లు ఇండియన్ వినియోగదారులకు బెస్ట్ సర్వీసు అందిస్తున్నాయి. రూ.500కంటే తక్కువ రేంజ్ లోనే బోలెడు బెనిఫిట్స్ ఇస్తున్నాయి దిగ్గజ నెట్‌వర్క్‌లు. 54రోజుల వ్యాలిడిటీతో అద్భుతమైన ఆఫర్లు ఇస్తున్న ప్రీపెయిడ్ ప్లాన్ల గురించి తెలుసుకున్నారా..

జియో రూ.399 ప్రీపెయిడ్ ప్లాన్: రిలయన్స్ జియో 56రోజుల ప్లాన్ రూ.500కంటే తక్కువ ధరకే అందిస్తుంది. రూ.399తో రీఛార్జ్ చేసుకుంటే రోజుకు 1.5జీబీ రావడంతో పాటు మొత్తం 56రోజులకు 84జీబీ డేటా వస్తుందన్నమాట. దాంతో పాటుగా జియో టూ జియో వాయీస్ కాల్స్, జియో టూ నాన్ జియో ఎఫ్‌యూపీ 2వేల నిమిషాలు, రోజుకు 100ఎస్ఎమ్ఎస్‌లతో పాటు కాంప్లిమెంటరీగా జియో సినిమా, జియో శావన్, మై జియో యాప్, జియో బ్రౌజర్ లకు యాక్సిస్ ఉంది.

ఎయిర్‌టెల్ రూ.399 ప్రీపెయిడ్ ప్లాన్: రూ.399 ధరలో 56రోజుల పాటు రోజుకు 1.5జీబీ డేటా. ఏ నెట్‌వర్క్‌కైనా అన్ లిమిటెడ్ వాయీస్ కాల్స్. దాంతో పాటు ఎయిర్‌టెల్ ఎక్స్‌ట్రీమ్ ప్రీమియం, వింక్ మ్యూజిక్, ఫ్యాస్టాగ్ కు రూ.100క్యాష్ బ్యాక్.

ఎయిర్‌టెల్ రూ.449 ప్రీపెయిడ్ ప్లాన్: ఎయిర్‌టెల్ ప్రతిరోజూ 2జీబీ 4జీ డేటా కేవలం రూ.449కే ఇస్తుంది. ఈ ఆఫర్ ప్రకారం.. 56రోజుల పాటు 112జీబీ డేటా ఇస్తుంది. దాంతో పాటు ఎయిర్‌టెల్ ఎక్స్‌ట్రీమ్ ప్రీమియం, వింక్ మ్యూజిక్, ఫ్యాస్టాగ్ కు రూ.100క్యాష్ బ్యాక్.

వొడాఫోన్ ఐడియా రూ.399 ప్రీపెయిడ్ ప్లాన్: రూ.399 ప్రీపెయిడ్ ప్లాన్ తో రోజుకు 1.5జీబీ డేటా 56రోజుల పాటు ఇస్తుంది. అంటే మొత్తంగా 84జీబీ డేటా వస్తుంది. దీంతో పాటు ఏ నెట్‌వర్క్‌కైనా అన్‌లిమిటెడ్ వాయీస్ కాల్స్, 1000ఎస్ఎమ్ఎస్ లు, వీఐ మూవీస్ & టీవీలకు యాక్సెస్ వస్తుంది.

వొడాఫోన్ ఐడియా రూ.449 ప్రీపెయిడ్ ప్లాన్: వొడాఫోన్ ఐడియా రూ.449 ప్రీపెయిడ్ ప్లాన్‌తో రోజుకు 4జీబీ డేటా 56రోజుల పాటు వస్తుంది. మొత్తంగా ఇది 224జీబీ డేటా వస్తుంది. దీంతో పాటు ఏ నెట్‌వర్క్‌కైనా అన్‌లిమిటెడ్ వాయీస్ కాల్స్, 1000ఎస్ఎమ్ఎస్ లు, వీఐ మూవీస్ & టీవీలకు యాక్సెస్ ఇస్తారు.