Amazon, Flipkartలకు పోటీగా జియో మార్ట్.. 200సిటీల్లో సర్వీస్

  • Published By: Subhan ,Published On : May 24, 2020 / 09:26 AM IST
Amazon, Flipkartలకు పోటీగా జియో మార్ట్.. 200సిటీల్లో సర్వీస్

రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఆన్‌లైన్ గ్రోసరీ సర్వీసులు మొదలుపెట్టేసింది. జియో మార్ట్ పేరిట మొదలుపెట్టిన రిటైల్ వ్యాపారం అమెజాన్.కామ్ లోకల్ యూనిట్, వాల్మార్ట్ (ఫ్లిప్ కార్ట్)లకు పెద్ద ఎదురుదెబ్బ కానుంది. దేశవ్యాప్తంగా 200కు పైగా పట్టణాల్లో డెలివరీ సేవలు అందించేందుకు జియో మార్ట్ రెడీ అయింది. ఈ మేరకు శనివారం చీఫ్ ఎగ్జిక్యూటివ్ గ్రోసరీ రిటైల్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. 

అయితే దీనిని ముంబైలోని రిలయన్స్ హెడ్ క్వార్టర్స్ ప్రకటించలేదు. జియో మార్ట్ లాంచ్ అయిన సమయంలోనే 7బిలియన్ డాలర్ల షేర్లు అమ్ముడుపోయాయి. గత నెల నుంచే ఇండియా ఆర్థిక రాజధాని ముంబైలో జియో మార్ట్ డెలివరీలను ప్రయోగాత్మకంగా మొదలుపెట్టింది. ఫేస్ బుక్‌కు 5.7బిలియన్ డాలర్లకు 10శాతం అమ్మకాలు జరిపిన తర్వాతనే ఈ ప్రాజెక్టు మొదలుపెట్టింది. 

ఈ పార్టనర్‌షిప్ రిలయన్స్ రిటైల్ వ్యాపారానికి ఇండియా గ్రోసరీలు, చిన్నపాటి వ్యాపారాలు, 40 కోట్ల మంది  యూజర్లు ఉన్న వాట్సప్ గ్రూపులే పెట్టుబడులు. ఈ సర్వీసు ద్వారా ఫ్రీ గూడ్స్ డెలివరీ అవుతూ ఉంటాయి. ఇంటి పక్కనే ఉన్న షాపుల నుంచి కూడా సరుకులు ఇంటికి తీసుకొచ్చి పెట్టే సదుపాయం కనుగొన్నారు. 

కరోనా వైరస్ లతో ఇండియా సంక్షోభం ఎదుర్కొంటున్న సమయంలో దీనిని లాంచ్ చేస్తున్నారు. లాక్‌డౌన్ ఎత్తేశాక సర్వీసును మరింత విస్తృతం చేస్తామని అధికార ప్రతినిధి అంటున్నారు. దీని లాంచింగ్ పై ముఖేశ్ అంబానీ వెంటనే రెస్సాండ్ కాలేదు. జియో ప్లాట్ ఫాంల ద్వారా రిలయన్స్ ఫండ్ రైజ్ చేయాలని భావిస్తుంది. ఫేస్ బుక్, కేకేఆర్ & కో ఇన్ క్లూజివ్, జనరల్ అట్లాంటిక్ లాంటి పెట్టుబడిదారుల నుంచి 10బిలియన్ డాలర్ల పెట్టుబడులు రాబట్టింది జియో.