Caste not change if religion changes : మతం మారినంత మాత్రాన కులం మారదు.. హైకోర్టు సంచలన తీర్పు

మతం మారినా కులం మారదని కోర్టు తీర్పునిచ్చింది. ప్రభుత్వ ఉద్యోగాల్లో ప్రాధాన్యత కోసం కులాంతర మ్యారేజ్ సర్టిఫికెట్ పొందటానికి క్రైస్తవమతం తీసుకున్న దళితుడికి కోర్టు ఝలక్ ఇచ్చింది.

Caste not change if religion changes : మతం మారినంత మాత్రాన కులం మారదు.. హైకోర్టు సంచలన తీర్పు

Caste Not Change If Religion Changes

religious conversion does not change caste say hc : కొంతమంది మతం మారుతుంటారు. క్రైస్తమ మతం, ఇస్లాం మతం, బౌద్ధ మతం ఇలా వారికి ఇష్టమొచ్చిన మతంలోకి మారుతుంటారు. అది ఆయా మతాలపై ఇష్టంతో కావచ్చు..లేదా పెళ్లి విషయంలో కావచ్చు. కానీ అలా మతం మారినంత మాత్రాన వారికి పుట్టుకతో వచ్చిన కులానికి సంబంధించిన సామాజిక వర్గం పేరు మారుతుందా? అంటే మారదు అని మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. మతం మారినా కులం మాత్రం మారదు అని తీర్పునిచ్చింది..‘ఆది-ద్రావిడ సామాజిక వర్గానికి చెందిన ఓ వ్యక్తి ప్రభుత్వ ఉద్యోగాలలో ప్రాధాన్యత కోసం కులాంతర వివాహ ధ్రువీకరణ పత్రం పొందేందుకు క్రైస్తవ మతాన్ని స్వీకరించిన దళితుడి విషయంలో మద్రాసు హైకోర్టు ఈ తీర్పునిచ్చింది. ఒక మతం నుంచి మరో మతంలోకి మారినా కులం మాత్రం మారదని మద్రాసు హైకోర్టు స్పష్టం చేసింది. ప్రభుత్వ ఉద్యోగాలలో ప్రాధాన్యత కోసం కులాంతర వివాహ ధ్రువీకరణ పత్రం పొందటానికి క్రైస్తవ మతం తీసుకున్న దళితుడి పిటిషన్‌ను రద్దు చేస్తూ తీర్పు వెలువరించింది.

Read more : Cyber Cheating : ఫ్లైట్ టికెట్ బుక్ చేస్తే రూ.9.5 లక్షలు మాయం చేసిన సైబర్ నేరగాళ్లు

చట్టం ప్రకారం మతం మార్చుకున్న దళితులను ఎస్సీలుగా కాకుండా వెనుకబడి వర్గం (బీసీలు)గా పరిగణిస్తారు. తమిళనాడులో ఎస్సీ/ ఎస్టీలు లేదా బీసీలను అగ్ర కులానికి చెందినవారి పెళ్లాడితే వాటిని కులాంతర వివాహాలుగా పరిగణిస్తారు. వీరికి ప్రభుత్వ ఉద్యోగాలలో ప్రాధాన్యత ఉంటుంది. ఈక్రమంలో కేవలం మతమార్పిడి చేసుకున్నంత మాత్రాన బీసీగా పరిగణించరని..దళితుడు మరొక దళితుడ్ని పెళ్లి చేసుకుంటే అది కులాంతర వివాహం కాదని మద్రాస్ హైకోర్టు జస్టిస్ ఎస్ఎం సుబ్రమణ్యం స్పష్టంచేశారు.పిటిషనర్ స్వతహాగా ఆది-ద్రావిడ సామాజిక వర్గానికి చెందినవాడు.. క్రైస్తవ మతంలోకి మారడంతో అతడికి వెనుకబడిన తరగతి సర్టిఫికేట్ జారీ అయ్యింది.. కానీ.. పుట్టుకతోనే అతడు ‘ఆది-ద్రావిడ’ కమ్యూనిటీకి చెందినవాడు.. మతం మారినా కులం మాత్రం మారదు.. షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, అత్యంత వెనుకబడిన తరగతులు, వెనుకబడిన తరగతులు, ఇతర కులాల వర్గీకరణ కులాన్ని మార్చదు..అది మారదు కూడా’’ అని జస్టిస్ సుబ్రమణ్యం స్పష్టం చేశారు.

బీసీ సర్టిఫికెట్ పొందిన క్రైస్తవ మతం స్వీకరించిన ఆది-ద్రావిడ దళితుడు ఎస్ పాల్ రాజ్‌. అతను హిందూ అరుంథతియార్ దళిత సామాజిక వర్గానికి చెందిన అముతా అనే యువతిని వివాహం చేసుకున్నాడు. కులాంతర వివాహం చేసుకున్న నేను బీసీనని, దళితుడ్ని కాదని రాజ్ వాదించారు. బీసీ వర్గానికి చెందిన వ్యక్తి ఎస్సీలను వివాహం చేసుకుంటే ప్రభుత్వ ఉద్యోగాలు, పథకాల్లోనూ ప్రాధాన్యత ఇస్తారని వాదించాడు. ఇందుకు 1976 డిసెంబరు 2న తమిళనాడు ప్రభుత్వం వెలువరించిన ఉత్వర్వులను ఈ వాదనల్లో ఉదాహరణగా చెప్పాడు.

Read more : China population crisis :చైనాలో పెరిగిపోతున్న‘బ్యాచిలర్స్’..పెళ్లి అంటేనే భయపడిపోతున్న అబ్బాయిలు..

‘జీవితభాగస్వాముల్లో ఒకరు ఎస్సీ లేదా ఎస్టీ సమాజానికి వర్గానికి చెందినవారైతే కులాంతర వివాహ ధ్రువీకరణ పత్రాన్ని జారీచేయాలని ఈ ఉత్తర్వులు చెబుతున్నాయి’ అని వాదించాడు. కానీ దీనిని తిరస్కరించిన సేలం జిల్లా అధికారులు..అతను స్వయంగా దళిత వర్గానికి చెందినవాడని, కానీ మతం మారడం వల్ల తన కులం మారదని పేర్కొన్నారు. దీంతో పాల్ రాజ్ హైకోర్టును ఆశ్రయించాడు. దీనిపై విచారించిన హైకోర్టు సేలం జిల్లా అధికారులు చెప్పినదాన్ని సమర్థించింది. మతం మారడం వల్ల తన కులం మారదని పేర్కొంది.

ఈ సందర్భంగా ధర్మాసనం పలు కీలక వ్యాఖ్యలు చేసింది. ‘మతం మారిన వ్యక్తి కులాంతర వివాహ ధ్రువీకరణ పత్రాన్ని జారీచేస్తే ఈ కోటా కింద మంజూరు చేసిన ప్రయోజనాన్ని దుర్వినియోగం చేయడానికి మార్గం సుగమం అవుతుందనీ..దాన్ని అనువుగా తీసుకుని పలువురు ఇదే మార్గాన్ని ఎంచుకంటారని వ్యాఖ్యానించింది. జీవిత భాగస్వాముల్లో ఎవరైనా షెడ్యూల్డ్ కులానికి చెందిన వారై..మరొకరు ఇతర కులానికి చెందినవారైతే మాత్రమే కులాంతర వివాహ ధ్రువీకరణ పత్రాన్ని జారీ చేయాలి’’ అని జస్టిస్ సుబ్రమణ్యం తన తీర్పులో పేర్కొన్నారు.