Insects In Sunflower : పొద్దు తిరుగుడులో రసం పీల్చే పురుగుల నివారణ

తామర పురుగులు ఈ పంటను మొదటిదశ నుంచి ఆశిస్తాయి. పైరు బెట్టకు గురైనపుడు వీటి ఉధృతి ఎక్కువగా ఉంటుంది. ఇవి చాలా చిన్నగా ఉండి పసుపుపచ్చ లేక గోధుమ రంగులో,

Insects In Sunflower : పొద్దు తిరుగుడులో రసం పీల్చే పురుగుల నివారణ

Sun Flower (1)

Insects In Sunflower : పొద్దు తిరుగుడు వార్షిక అదాయ పంటలలో ప్రధానమైది. వేరుశనగ నూనె, నువ్వులనూనె కన్నా ఇటీవలికాలంలో ప్రొద్దు తిరుగుడు నూనె వాడకం బాగా పెరిగింది. దీంతో పొద్దుతిరుగుడు సాగు చెయ్యడానికి రైతులు ఆసక్తి చూపుతున్నారు. పొద్దు తిరుగుడు పంట సాగులో చీడపీడల విషయంలో రైతులు తగిన జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంటుంది. యాజమాన్య పద్దతుల విషయంలో సరైన మెళుకువలు పాటిస్తే పొద్దు తిరుగుడు పంట రైతులకు లాభదాయంగా మారుతుంది. ముఖ్యంగా పొద్దుతిరుగుడు పంటను ఆశించే చీడపీడల్లో రసం పీల్చే పురుగులు బెడద అధికం. వీటిని సకాలంలో నిర్మూలించి పంటను రక్షించుకోవాలి. వాటిని నివారణకు సంబంధించి కొన్ని సూచనలను వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు.

తెల్లదోమ ఆకుల అడుగు భాగం నుండి రసాన్ని పీల్చడం వలన ఆకులు పసుపు రంగుకు మారి మొక్కలు కూడా గిడసబారి ఎండిపోతాయి. వీటి నివారణకు ట్రైజోఫాస్‌ 2.5 మి.లీ. లేదా ఎసిఫేట్‌ 1 గ్రా. లేదా మోనోక్రోటోఫాస్‌ 1.6 మి.లీ. లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.

తామర పురుగులు ఈ పంటను మొదటిదశ నుంచి ఆశిస్తాయి. పైరు బెట్టకు గురైనపుడు వీటి ఉధృతి ఎక్కువగా ఉంటుంది. ఇవి చాలా చిన్నగా ఉండి పసుపుపచ్చ లేక గోధుమ రంగులో, చీలిన రెక్కలతో ఉంటాయి. పిల్ల, పెద్ద పురుగులు ఆకులను, పువ్వుల రసాన్ని పీలుస్తాయి. వీటిని అదుపు చేసే నిమిత్తం మందులు పిచికారి చేయడం కంటే కిలో విత్తనానికి 5 గ్రా. ఇమిడాక్లోప్రిడ్‌తో విత్తన శుద్ధి చేస్తే మంచిది. తద్వారా సహజంగా అదుపుచేసే మిత్రపురుగులు పైరులో వృద్ధి చెందుతాయి. మోనోక్రోటోఫాస్‌ 1.6 మి.లీ. లీటరు నీటికి లేదా ఇమిడాక్లోప్రిడ్‌ 4 మి.లీ. 10 లీటర్ల నీటిలో కలిపి రెండు లేక మూడు సార్లు పిచికారి చేయాలి.

పచ్చ దీపపు పురుగులు, తెల్ల దోమలు, తామర పురుగులు దీపపు పురుగులు ఆశించిన ఆకుల చివర్లు పసుపు పచ్చగా మారి, క్రమేపి ఆకు అంతా ఎర్రబడి, చివరగా ఆకులు ముడుచుకొని దోనెలలాగా కనిపిస్తాయి. వీటి నివారణకు మోనోక్రోటోఫాస్‌ 1.6 మి.లీ. లేదా డైమిథోయేట్‌ 2.0 మి.లీ. లేదా మిథైల్‌ డెమెటాన్‌ 2 మి.లీ. లీటరు నీటికి కలిపి ఆకుల అడుగుభాగం బాగా తడిసేలా పిచికారి చేయాలి.