Remove Bapu image from Notes : ‘కరెన్సీ నోట్లపై గాంధీ బొమ్మ తీసేయండి’ : గాంధీ మనవడు తుషార్ గాంధీ

కరెన్సీ నోట్లపైనా గాంధీ బొమ్మను తీసేయండి అంటూ మహాత్మా గాంధీ ముని మనవడు తుషార్ గాంధీ ట్వీట్ చేశారు.

Remove Bapu image from Notes :  ‘కరెన్సీ నోట్లపై గాంధీ బొమ్మ తీసేయండి’ : గాంధీ మనవడు తుషార్ గాంధీ

Remove Bapus image from notes

Remove Bapus image from notes : కరెన్సీ నోట్లపైనా గాంధీ బొమ్మను తీసేయండి అంటూ మహాత్మా గాంధీ ముని మనవడు తుషార్ గాంధీ ట్వీట్ చేశారు. ఆర్బీఐ ప్రవేశపెట్టిన డిజిటల్ కరెన్సీపై బాపు చిత్రాన్ని లేకుండా చేశారు. ఇక కరెన్సీ నోట్లనుంచి కూడా ఆయన చిత్రాన్ని తీసివేయండీ అంటూ ట్వీట్ చేశారు తుషార్ గాంధీ. ఇటీవలే సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ (సీబీడీసీ/ఈ రూపీ)ని ఆర్ బీఐ విడుదల చేసింది. దీన్నిరిటైల్, హోల్ సేల్ లావాదేవీలకు వినియోగిస్తూ, ప్రయోగాత్మకంగా కొన్ని పట్టణాల్లో పరీక్షిస్తున్నారు. ఈ రూపీపై మహాత్మా గాంధీ ఫొటో లేకపోవడంతో గాంధీ ముని మనవడు తుషార్ అరుణ్ గాంధీ తన అసంతృప్తిని, ఆగ్రహాన్ని వ్యంగ్యాస్త్రంగా ఆర్మీఐపై సంధించారు.

‘‘ కొత్తగా ప్రవేశపెట్టిన డిజిటల్ కరెన్సీపై బాపూ బొమ్మ వేయనందుకు ఆర్ బీఐకి, భారత ప్రభుత్వానికి ధన్యవాదాలు. ఇప్పుడు దయ చేసి ఆయన ఫొటోని పేపర్ కరెన్సీపైనా తొలగించండి’’ అంటూ తుషార్ గాంధీ తన ట్విట్టర్ లో పేర్కొన్నారు. మరి తుషార్ గాంధీ చేసిన ఈ ట్వీట్ పై కేంద్ర ప్రభుత్వం స్పందిదా? స్పందిస్తే ఏవిధంగా స్పందిస్తుందో వేచి చూడాలి.

తుషార్ గాంధీ ట్వీట్ పై కేంద్రం స్పందన ఎలా ఉంటుందో గానీ యూజర్లు మాత్రం పలు విధాలుగా స్పందిస్తున్నారు. ఎక్కువగా తుషార్ గాంధీకి వ్యతిరేకంగా స్పందిస్తూ కామెంట్లు పెడుతున్నారు. ఓ యూజర్ ‘ఒక్క గాంధీ ఫొటోనే ఎందుకు వేయాలి సర్.. ఆ మాటకొస్తే కరెన్సీ నోట్లు, కాయిన్లపై అందరు స్వాతంత్ర్య సమరయోధుల చిత్రాలను వేయాల్సిందే’ పేర్కొన్నాడు. మరో యూజర్ అయితే బాపూ? గతంలో జీవించటం మానేయండి. బాపూ వారసత్వాన్ని దోపిడీ చేయటం మానేయండి మీరు సొంతంగా దేవం కోసం ఏదైనా చేయండీ అంటూ వ్యాఖ్యానించారు.  భారతదేశంలోఎన్నో వారసత్వ చిహ్నాలున్నాయి..వాటిని ముద్రించవచ్చు. బేలూరు,హళేబుడు, కోణార్క్ వంటి చిహ్నాలను కరెన్సీపై ముద్రించవచ్చని సూచిస్తూ మీరు మీ గులాబీ ఆలోచనలను ఇక ఆపాలి అంటూ పేర్కొన్నాడు.

కాగా..పేపర్ కరెన్సీ వినియోగానికి ప్రత్యామ్నాయంగా డిజిటల్ కరెన్సీని సీబీడీసీ (ఈ-రూపీ) పేరుతో ఆర్ బీఐ తీసుకొచ్చింది. దీనివల్ల ఎన్నో ఖర్చులు ఆదా చేయవచ్చు.అంతేకాదు నగదు నిర్వహణ రూపంలో ఉన్న సమస్యలకు పరిష్కారం లభించనుందని భావన ఉంది. ప్రస్తుతం వినియోగంలో ఉన్న అన్ని రకాల కరెన్సీ నోట్ల డినామినేషన్లలో ఈ-రూపీ కూడా అందుబాటులోకి రానుంది. ఈ రూపీ వచ్చినా భౌతిక కరెన్సీ నోట్లు కూడా చలామణిలో ఉంటాయి.