Replacement : న్యూఢిల్లీ వీఎంఎంసీ హాస్పటల్ లో 229పోస్టుల భర్తీ

దరఖాస్తు ఫీజుకు సంబంధించి జనరల్‌ అభ్యర్థులు రూ.500, ఓబీసీ అభ్యర్థులు రూ.250 చెల్లించాలి. ఈబ్ల్యూఎస్‌ ఎస్సీ,ఎస్టీ,పీడబ్ల్యూడీ అభ్యర్థులకు ఫీజు లేదు.

Replacement : న్యూఢిల్లీ వీఎంఎంసీ హాస్పటల్ లో 229పోస్టుల భర్తీ

Jobs

Replacement : భారత ప్రభుత్వ ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖకు చెందిన న్యూఢిల్లీలోని వర్ధమాన్‌ మహావీర్‌ మెడికల్‌ కాలేజీ(వీఎంఎంసీ) సఫ్దర్‌జంగ్‌ హాస్పిటల్‌ లో ఒప్పంద ప్రాతిపదికన వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ అయింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 229 ఖాళీలను భర్తీ చేయనున్నారు. అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నారు. జూనియర్‌ రెసిడెంట్‌, జూనియర్‌ రెసిడెంట్‌(నాన్‌- పీజీ) డెంటల్‌ సర్జరీ అండ్‌ మాక్సిల్లో సేషియల్‌ సర్జరీ పోస్టులను భర్తీ చేయనున్నారు.

ఆయా పోస్టులను అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ ఉత్తీర్ణత. 2020 జనవరి 01 నాటికి ఇంటర్న్‌షిప్‌ పూర్తిచేసిన అభ్యర్ధులు దరఖాస్తుకు అర్హులు. అభ్యర్ధుల ఎంపిక రాత పరీక్ష ఆధారంగా నిర్వహిస్తారు. అభ్యర్ధులు ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

దరఖాస్తు ఫీజుకు సంబంధించి జనరల్‌ అభ్యర్థులు రూ.500, ఓబీసీ అభ్యర్థులు రూ.250 చెల్లించాలి. ఈబ్ల్యూఎస్‌ ఎస్సీ,ఎస్టీ,పీడబ్ల్యూడీ అభ్యర్థులకు ఫీజు లేదు. దరఖాస్తుకు నవంబరు 23ను చివరి తేదిగా నిర్ణయించారు. పూర్తి చేసిన దరఖాస్తులను పంపాల్సిన చిరునామా ; ఆఫీస్‌ ఆఫ్‌ ద మెడికల్‌ సూపరింటెండెంట్‌, సఫ్దార్‌జంగ్‌ హాస్పిటల్‌ అండ్‌ వీఎంఎంసీ, న్యూఢిల్లీ- 110029 పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: http://vmmc-sjh.nic.in/