Bsnl : బిఎస్ఎన్ఎల్ లో డిప్లోమా అప్రెంటిస్ ల భర్తీ

ఎంపిక విధానం విషయానికి వస్తే ఇంజనీరింగ్‌ డిప్లొమాలో సాధించిన మెరిట్‌ మార్కులు, పర్సనల్‌ ఇంటర్వ్యూ ఆధారంగా షార్ట్‌లిస్ట్‌ చేస్తారు.

Bsnl : బిఎస్ఎన్ఎల్ లో డిప్లోమా అప్రెంటిస్ ల భర్తీ

Bsnl

Bsnl : మహారాష్ట్ర సర్కిల్‌కు చెందిన భారత్‌ సంచార్‌ నిగమ్‌ లిమిటెడ్‌(బీ ఎస్ ఎన్ ఎల్‌)లో డిప్లొమా అప్రెంటి్‌సల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఈనోటిఫికేషన్ ద్వారా మొత్తం 55 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఇంజనీరింగ్‌/టెక్నాలజీలో డిప్లొమా ఉత్తీర్ణత సాధించిన వారు దరఖాస్తుకు అర్హులు. అభ్యర్ధుల వయసు 2021 డిసెంబరు 29 నాటికి 25 ఏళ్లు మించకూడదు. ఎంపికైన వారికి నెలకు రూ.8000 స్టయిపెండ్‌గా చెల్లిస్తారు.

ఎంపిక విధానం విషయానికి వస్తే ఇంజనీరింగ్‌ డిప్లొమాలో సాధించిన మెరిట్‌ మార్కులు, పర్సనల్‌ ఇంటర్వ్యూ ఆధారంగా షార్ట్‌లిస్ట్‌ చేస్తారు. షార్ట్‌లిస్ట్‌ చేసిన అభ్యర్థుల్ని డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌ అనంతరం ఎంపిక చేస్తారు. అభ్యర్ధులు తమ దరఖాస్తులను ఆన్‌లైన్‌లో పంపాల్సి ఉంటుంది. ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ డిసెంబరు 29గా నిర్ణయించారు. పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌:http://portal.mhrdnats.gov.in/సంప్రదించగలరు.