BCPL Recruitment 2021 : బీసీపీఎల్ లో నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీ

ఫోర్‌మెన్‌ ట్రెయినీ పోస్టుకు సంబంధించి సంబంధిత స్పెషలైజేషన్‌లో ఇంజనీరింగ్‌ డిప్లొమా ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

BCPL Recruitment 2021 : బీసీపీఎల్ లో నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీ

Jobs

BCPL Recruitment 2021 : దిబ్రూగఢ్‌లోని బ్రహ్మపుత్ర కాకర్‌ అండ్‌ పాలిమర్‌ లిమిటెడ్‌(బీసీపీఎల్‌)లో నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 12 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఎలక్ట్రికల్‌, కెమికల్‌, మెకానికల్ విభాగాలలో ఫోర్‌మెన్‌ ట్రెయినీ, ఆపరేటర్‌ ట్రెయినీ, టెక్నీషియన్‌ ట్రెయినీ పోస్టులను భర్తీ చేస్తారు.

ఫోర్‌మెన్‌ ట్రెయినీ పోస్టుకు సంబంధించి సంబంధిత స్పెషలైజేషన్‌లో ఇంజనీరింగ్‌ డిప్లొమా ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అభ్యర్ధుల వయస్సు 30 ఏళ్లు మించకూడదు. నెలకు రూ.23,000 వేతనం చెల్లిస్తారు. ఆపరేటర్‌ ట్రెయినీ పోస్టుకు సంబంధించి అభ్యర్ధులు బ్యాచిలర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణత అర్హత ఉండాలి. వయస్సు 30 ఏళ్లు మించకూడదు. నెలకు రూ.21,000 వేతనంగా చెల్లిస్తారు. టెక్నీషియన్‌ ట్రెయినీ పోస్టుకు సంబంధించి మెట్రిక్యులేషన్‌తోపాటు సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ ఉత్తీర్ణత ఉండాలి. అభ్యర్ధుల వయస్సు 30 ఏళ్లు మించరాదు. నెలకు 21,000 వేతనం చెల్లిస్తారు. అకౌంట్స్‌ అసిస్టెంట్‌ పోస్టుకు సంబంధించి బ్యాచిలర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణత. కంప్యూటర్‌ టైపింగ్‌లో అర్హత సాధించాలి. వయసు 30 ఏళ్లు మించకూడదు. నెలకు రూ.21,000 వేతనం చెల్లిస్తారు.

స్ర్కీనింగ్‌, షార్ట్‌లిస్టింగ్‌ ద్వారా తుది ఎంపిక ఉంటుంది. అభ్యర్ధులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తుకు చివరి తేదీ డిసెంబరు 11గా నిర్ణయించారు. పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: https://bcplonline.co.in/Career/ openings/