NHPC Recruitment 2021 : ఎన్ హెచ్ పీసీలో ట్రెయినీ ఇంజనీర్ల భర్తీ

కనీసం 60 శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టుల్లో ఫుల్‌టైం బీఈ,బీటెక్‌,బీఎస్సీ(ఇంజనీరింగ్‌) ఉత్తీర్ణత అర్హత కలిగి ఉండాలి. అభ్యర్ధుల వయస్సు 30 ఏళ్లు మించకుండా ఉండాలి. జీతభత్యాలుగా నెలకు రూ.50,000 నుంచి రూ.1,60,000 చెల్లిస్తారు.

NHPC Recruitment 2021 : ఎన్ హెచ్ పీసీలో ట్రెయినీ ఇంజనీర్ల భర్తీ

Nhpc

NHPC Recruitment 2021 : భారత ప్రభుత్వానికి చెందిన ఫరీదాబాద్‌ , హరియాణ లోని ఎన్‌హెచ్‌పీసీ లిమిటెడ్‌… కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఈ నోటిఫికేషన్ ద్వారా 53 ట్రెయినీ ఇంజనీర్ల పోస్టులు భర్తీ చేస్తారు. విభాగాల వారీగా ఖాళీలను పరిశీలిస్తే సివిల్‌ విభాగంలో 29 ఖాళీలు, మెకానికల్ విభాగంలో 20 ఖాళీలు, ఎలక్ట్రికల్ విభాగంలో 4 ఖాళీలు ఉన్నాయి.

కనీసం 60 శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టుల్లో ఫుల్‌టైం బీఈ,బీటెక్‌,బీఎస్సీ(ఇంజనీరింగ్‌) ఉత్తీర్ణత అర్హత కలిగి ఉండాలి. అభ్యర్ధుల వయస్సు 30 ఏళ్లు మించకుండా ఉండాలి. జీతభత్యాలుగా నెలకు రూ.50,000 నుంచి రూ.1,60,000 చెల్లిస్తారు.

ట్రెయినీ ఆఫీసర్లు ఖాళీలకు సంబంధించి 14ఖాళీలు ఉన్నాయి. విభాగాల వారీగా ఖాళీలు పరిశీలిస్తే ఫైనాన్స్‌ విభాగంలో12 ఖాళీలు, కంపెనీ సెక్రటరీ విభాగంలో 2 ఖాళీలు ఉన్నాయి. అభ్యర్ధుల వయస్సు 30 ఏళ్లు మించకుండా ఉండాలి. జీతభత్యాలుగా నెలకు రూ.50,000 నుంచి రూ.1,60,000 చెల్లిస్తారు.

ఎంపిక విధానానికి సంబంధించి గేట్‌-2021, సీఏ,సీఎంఏ, సీఎస్‌ స్కోర్స్‌ ఆధారంగా అభ్యర్థుల్ని షార్ట్‌లిస్ట్‌ చేస్తారు. షార్ట్‌లిస్ట్‌ చేసిన అభ్యర్థుల్ని సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌కి పిలుస్తారు. దరఖాస్తును ఆన్ లైన్ ద్వారా పంపాల్సి ఉంటుంది. దరఖాస్తుకు చివరి తేదీగా జనవరి 17ను నిర్ణయించారు. పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: http://www.nhpcindia.com/ సంప్రదించగలరు.