అసలు కారణం ఇదే : హిందువుల కోసం ప్ర‌త్యేకంగా రీ పోలింగ్

పశ్చిమ బెంగాల్, రాయ్ గంజ్ లోని మూడు పోలింగ్ బూత్ ల్లో ఏప్రిల్ 29న రీపోలింగ్ జరుగనుంది. హిందువుల కోసం ప్రత్యేకించి ఈ మూడు పోలింగ్ బూత్ ల్లో రీపోలింగ్ నిర్వహించనున్నారు.

  • Published By: sreehari ,Published On : April 27, 2019 / 12:44 PM IST
అసలు కారణం ఇదే : హిందువుల కోసం ప్ర‌త్యేకంగా రీ పోలింగ్

పశ్చిమ బెంగాల్, రాయ్ గంజ్ లోని మూడు పోలింగ్ బూత్ ల్లో ఏప్రిల్ 29న రీపోలింగ్ జరుగనుంది. హిందువుల కోసం ప్రత్యేకించి ఈ మూడు పోలింగ్ బూత్ ల్లో రీపోలింగ్ నిర్వహించనున్నారు.

పశ్చిమ బెంగాల్ రాయ్ గంజ్ లోని మూడు పోలింగ్ బూత్ ల్లో ఏప్రిల్ 29న రీపోలింగ్ జరుగనుంది. హిందువుల కోసం ప్రత్యేకించి ఈ మూడు పోలింగ్ బూత్ ల్లో రీపోలింగ్ నిర్వహించనున్నారు. రాయ్ గంజ్ లో ఇటీవల జరిగిన 2019 లోక్ సభ ఎన్నికల్లో మూడు పోలింగ్ బూత్ ల దగ్గర విధ్వంసక ఘటన లు చోటుచేసుకున్నాయి. ఈ క్రమంలో ఆ నియోజవర్గంలో నాల్గో దశ ఎన్నికల సమయంలో మళ్లీ రీపోలింగ్ నిర్వహించనునట్టు రాష్ట్ర ఎన్నికల అధికారి శనివారం (ఏప్రిల్ 27, 2019) ప్రకటించారు.

ఈసీ నోటిఫికేషన్ ప్రకారం.. ధోలోగచ్ ఎస్ఎస్ కే లోని పోలింగ్ స్టేషన్ నెంబర్ 19, ఇస్లాంపూర్ అసెంబ్లీ సిగ్మంట్ లోని పటగోరా బాలిక విద్యాలయలో నెంబర్ 37, గోల్ పొఖార్ అసెంబ్లీ సిగ్మంట్ లోని లోహా గచ్చి ఆది బాసిపాడలో నెంబర్ 191 పోలింగ్ బూత్ ల్లో రీపోలింగ్ జరుగనుంది. ఈ మూడు పోలింగ్ బూత్ ల్లో ఏప్రిల్ 18న రాయ్ గంజ్ నియోజవర్గంలో పోలింగ్ నిర్వహించారు.

నెంబర్ 191 పోలింగ్ కేంద్రం దగ్గర అధికార పార్టీ తృణమూల్ కు చెందిన కొందరు వ్యక్తులు.. హిందువులను ఓటు వేయకుండా అడ్డుకున్నారు. దీంతో గ్రామానికి చెందిన ఇరువర్గాల మధ్య ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది. చాలామంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోకుండానే వెళ్లిపోయారు. ఈ ఘటనకు సంబంధించి వీడియోలు, మీడియా కథనాలు, బీజేపీ, సీపీఐఎం పార్టీలు (విధ్వంసక చర్యలు, ఎన్నికల దుష్ప్రవర్తన) ఇచ్చిన ఫిర్యాదుల ఆధారంగా ఎన్నికల కమిషన్ ఆయా మూడు పోలింగ్ బూత్ ల్లో రీపోలింగ్ నిర్వహించనున్నట్టు వెల్లడించింది.

తొలి దశ ఓటింగ్ నుంచి బెంగాల్ ల్లో పలు పోలింగ్ కేంద్రాల్లో విధ్వంసక ఘటనలు జరిగాయి. బెంగాల్ లోని ముర్షిద్ బాద్ లో రెండో దశ పోలింగ్ జరుగుతున్న సమయంలో కొందరు నాటు బాంబులను విసిరారు. ఈ ఘటనలో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.