Expired Covid Vaccine : వ్యాక్సిన్ ఎక్స్‌పైరీ.. క్లారిటీ ఇచ్చిన కేంద్రం

దేశంలో ఎక్స్ పైరీ వ్యాక్సిన్ ఇస్తున్నట్లు వస్తున్న వార్తలపై కేంద్రం క్లారిటీ ఇచ్చింది. అవన్నీ తప్పుడు, నిరాధారమైన ఆరోపణలని స్పష్టం చేసింది.

Expired Covid Vaccine : వ్యాక్సిన్ ఎక్స్‌పైరీ.. క్లారిటీ ఇచ్చిన కేంద్రం

Covid Vaccine

Expired Covid Vaccine : దేశంలో ఎక్స్ పైరీ వ్యాక్సిన్ ఇస్తున్నట్లు వస్తున్న వార్తలపై కేంద్రం క్లారిటీ ఇచ్చింది. అవన్నీ తప్పుడు, నిరాధారమైన ఆరోపణలని స్పష్టం చేసింది. కొవాగ్జిన్ ఎక్స్ పైరీని సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ 9 నెలల నుంచి 12 నెలలకు పెంచిందని కేంద్రం తెలిపింది. అలాగే కొవిషీల్డ్ గడువును 6 నెలల నుంచి 12 నెలలకు పొడిగించిందని, తప్పుడు ప్రచారాలను ఎవరూ నమ్మొద్దని కేంద్రం కోరింది.

Tea : పిల్లలు టీ తాగటం ఆరోగ్యానికి మంచిదేనా?

కాగా, దేశంలో 15 నుంచి 18 ఏళ్ల వయస్సు వారికి సోమవారం నుంచి వ్యాక్సినేషన్‌ ప్రారంభమైంది. అయితే, వీరికి ఎక్స్ పైరీ అయిన వ్యాక్సిన్లు ఇస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. దీనిపై స్పందించిన కేంద్రం అందులో వాస్తవం లేదని తేల్చి చెప్పింది. “దేశంలో జాతీయ కోవిడ్ టీకా కార్యక్రమం కింద గడువు ముగిసిన వ్యాక్సిన్లు ఇస్తున్నారని ఆరోపిస్తూ కొన్ని మీడియా నివేదికలు వచ్చాయి. ఇది అవాస్తవం. అసంపూర్ణ సమాచారం. తప్పుదారి పట్టించేది” అని కేంద్రం ప్రకటించింది.

Fenugreek Seeds : చెడు కొలెస్ట్రాల్ ను కరిగించి బరువు తగ్గించే మెంతులు

కాగా, పిల్లల వ్యాక్సినేషన్‌పై కేంద్రం పలు సూచనలు చేసింది. పిల్లల కోసం ప్రత్యేకంగా టీకా కేంద్రాలను ఏర్పాటు చేయాలని రాష్ట్రాలకు సూచన చేసింది. పిల్లలకు, పెద్దలకు ఒకే వ్యాక్సిన్‌ కేంద్రంలో టీకాలు వేస్తే వ్యాక్సిన్లు కలిసిపోవచ్చంది. పిల్లలకు కొవాగ్జిన్‌కు బదులు పొరపాటున వేరే టీకాలు వేసే ప్రమాదం ఉందని హెచ్చరించింది. పిల్లలకు కేవలం కొవాగ్జిన్‌ను మాత్రమే వేయాలని కేంద్రప్రభుత్వం నిర్ణయించింది. దేశంలో 15 నుంచి 18 ఏళ్ల వయస్సున్న వారు దాదాపు 10 కోట్ల మంది ఉంటారని అంచనా.