బీటింగ్ రిట్రీట్ : వాఘా సరిహద్దులో సైనిక విన్యాసాలు

  • Published By: madhu ,Published On : January 26, 2019 / 01:03 PM IST
బీటింగ్ రిట్రీట్ : వాఘా సరిహద్దులో సైనిక విన్యాసాలు

వాఘా :  రిపబ్లిక్ డే…దేశ వ్యాప్తంగా వేడుకలు ఘనంగా జరిగాయి. జనవరి 26వ తేదీ సాయంత్రం మాత్రం అందరి కళ్లూ బీటింగ్ రిట్రీట్‌పైనే ఉన్నాయి. భారత్ – పాకిస్తాన్ దేశాల సైనికులు నిర్వహించిన విన్యాసాలు హైలెట్‌గా నిలిచాయి. ఈ విన్యాసాలను చూసేందుకు భారీగా ప్రజలు తరలివచ్చారు. భారత్ మాతాకీ జై…జై జవాన్..అనే నినాదాలు మారుమోగాయి. సైనికులను ప్రజలు ఉత్సాహపరిచారు. ప్రతొక్క భారతీయుడు చూడాల్సింది ఈ రిట్రీట్. భారత్, పాకిస్తాన్‌ల మధ్యనున్న ఈ సరిహద్దు పోస్టు వద్ద ప్రతిరోజు సాయంత్రం బీటింగ్ రిట్రీట్ జరుగుతూ ఉంటుంది. అయితే..స్వాతంత్ర..గణతంత్ర దినోత్సవాలు ప్రత్యేక కార్యక్రమంగా దీనిని నిర్వహిస్తుంటారు.