గణతంత్ర సందడి : త్రివర్ణంలో వెలిగిపోతున్న ATC టవర్

  • Published By: veegamteam ,Published On : January 24, 2020 / 04:11 AM IST
గణతంత్ర సందడి : త్రివర్ణంలో వెలిగిపోతున్న ATC టవర్

గణతంత్ర దినోతవ్సవాలకు ముందే దేశరాజధాని ఢిల్లీలో ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలోని ఎటిసి టవర్ త్రివర్ణంలో వెలిగిపోయింది. చూసినవారిని కళ్లు తిప్పుకోనివ్వకుండా ఎటిసి టవర్ సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ గా మారింది. 

భారతదేశపు జాతీయ పండుగల్లో జనవరి 26 ఒకటి. గణతంత్ర దినోత్సవం రోజు కోసం దేశ రాజధాని ఢిల్లీ ముస్తామవుతోంది. ఆగస్టు 15, 1947 న భారతదేశం స్వాతంత్ర్యం పొందింది, జనవరి 26, 1950 న భారతదేశం స్వతంత్ర గణతంత్ర రాజ్యంగా అవతరించింది. భారత రాజ్యాంగాన్ని స్వీకరించిన రోజును రిపబ్లిక్ డే గౌరవించుకుంటూ అత్యంత దేశ భక్తితో ఈ రోజును జరుపుకుంటామనే విషయం తెలిసిందే. 

జనవరి 26 మన జాతీయ జెండాకు వందనం చేస్తాం. మువ్వన్నెలతో స్వేచ్ఛగా ఎగుతున్న జెండాను చూసి ప్రతీ భారతీయుడు మరోసారి గర్విస్తాడు. రిపబ్లిక్ డే పరేడ్‌లో ముందంజలో ఉంచిన వారసత్వం..సంస్కృతిని చూసి ఎంతగా ఆనందపడతాము. ఈ రిపబ్లిక్ డే పరేడ్ 2020 వేడుకల్లో బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బోల్సోనారో ముఖ్య అతిథిగా పాల్గొననుండటం మరో విశేషం.