Republic Day : నేతాజీకి జై, గణతంత్ర దినోత్సవాలు 23వ తేదీ నుంచే

ఆయన పోరాటానికి గుర్తింపుగా గతేడాది నేతాజీ పుట్టిన రోజును పరాక్రమ్ దివస్‌గా భారత్‌ నిర్ణయించింది. ఈ ఏడాది కూడా నేతాజీకి మరో...

Republic Day : నేతాజీకి జై, గణతంత్ర దినోత్సవాలు 23వ తేదీ నుంచే

Netaji

Republic Day Celebrations : ఆజాద్ హింద్ ఫౌజ్‌‌తో బ్రిటిషర్లపై యుద్ధం ప్రకటించి భారత స్వాతంత్య్ర సంగ్రామాన్ని మరో మలుపు తిప్పిన నేతాజీ సుభాష్ చంద్రబోస్‌కు కేంద్ర ప్రభుత్వం అరుదైన గౌరవం కల్పించింది. ఈ ఏడాది గణతంత్ర దినోత్సవ వేడుకలను ఒక రోజు ముందునుంచే మొదలవనున్నాయి. ప్రతి ఏడాది జనవరి 24, 25, 26న రిపబ్లిక్‌ డే వేడుకలు జరుగుతాయి. ఈసారి జనవరి 23నుంచే వేడుకలు స్టార్ట్ అవుతాయి. జనవరి 23న నేతాజీ పుట్టినరోజు కావడంతో ఇకపై ప్రతి ఏటా గణతంత్ర దినోత్సవ వేడుకలు ఆ రోజు నుంచే మొదలవుతాయి. దీంతో మూడు రోజుల వేడుక కాస్త నాలుగు రోజులకు పెరిగినట్లయింది.

Read More : AP Corona Cases : ఏపీలో కరోనా టెర్రర్.. భారీగా పెరిగిన కేసులు.. ఆ రెండు జిల్లాల్లో వెయ్యికిపైగా నమోదు

సుభాష్ చంద్రబోస్ 1897 జ‌న‌వ‌రి 23న ఒడిశాలోని క‌ట‌క్‌లో జ‌న్మించారు. భార‌త స్వాతంత్య్రోద్యమంలో ఆయన పాత్ర ప్రత్యేకమైనది. భారత్‌ ఆర్మీని ఆయన ముందుండి నడిపించారు. రష్యా, జపాన్ తదితర దేశాల సాయంతో బ్రిటిషర్లను ఓడించడానికి ప్రయత్నాలు చేశారు. కానీ, అనూహ్య రీతిలో కన్నుమూశారు.

Read More : CPI Narayana : ఒంటరిగా సీఎం జగన్‌‌ని కలవడం చిరంజీవి చేసిన పొరపాటు, సీపీఐ నారాయణ

1945 ఆగ‌స్ట్ 18న తైపీలో జ‌రిగిన విమాన ప్రమాదంలో సుభాష్ చంద్రబోస్ మ‌ర‌ణించినట్లు భావిస్తారు. ఆయన పోరాటానికి గుర్తింపుగా గతేడాది నేతాజీ పుట్టిన రోజును పరాక్రమ్ దివస్‌గా భారత్‌ నిర్ణయించింది. ఈ ఏడాది కూడా నేతాజీకి మరో అరుదైన కల్పించేలా కేంద్రం నిర్ణయం తీసుకుంది.