Republic Day 2020: తొలిసారి చినూక్ హెవీ హెలికాప్టర్‌తో విన్యాసాలు

Republic Day 2020: తొలిసారి చినూక్ హెవీ హెలికాప్టర్‌తో విన్యాసాలు

రిపబ్లిక్ డే 2020 సందర్భంగా గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. పరేడ్ వేదికగా హెవీ హెలికాప్టర్ చినూక్, హెలికాప్టర్ అపాచీల విన్యాసాలు కనువిందు చేశాయి. చినూక్ హెలికాప్టర్‌ను రిమోట్ లొకేషన్స్‌లో ల్యాండ్ అయ్యేందుకు సిద్ధం చేశారు. భారీ బరువులను మోయడంతో పాటు ఎక్కడికైనా వెళ్లగలదు. 

డిజాస్టర్ రిలీఫ్ లేదా భారీ మిషన్లు లాంటి ఘటనలలో వీటిని వాడతారు. మరోవైపు అపాచీ హెలికాప్టర్ గాలిలో ఉండే గాలిలో శత్రువులపై, నేలపై ఉన్నవారిపైనా దాడులు జరపడానికి ఉపయోగిస్తారు. రాకెట్లు, ఫ్రంట్ గన్ లాంటి ఆయుధాలు దీనిలో ఇన్‌ బిల్ట్‌గా ఉంటాయి. 

వీటితో పాటు రెండు కొత్త హెలికాఫ్టర్‌లు అడ్వాన్స్‌డ్ లైట్ హెలికాప్టర్(ఏఎల్‌హెచ్) ధ్రువ్, ఎమ్ఐ-17 హెలికాప్టర్, డొర్నియర్ మల్టీ పర్పస్ ఎయిర్‌క్రాఫ్ట్, సీ-130జే సూపర్ హెర్క్యూలస్ ఎయిర్‌క్రాఫ్ట్ లతో పాటు డీఆర్డీఓ ఎయిర్ బోర్న్ యర్లీ వార్నింగ్, జాగ్వార్ ఫైటర్ జెట్స్, అప్ గ్రేడెడ్ ఎమ్ఐజీ 29 సుపీరియర్ ఫైటర్ జెట్స్, సుఖోయ్ సు-30ఎమ్కేఐ ట్విన్జెట్ మల్టీ రోల్ ఎయిర్ సుపీరియారిటీ ఫైటర్ జెట్స్ లు పరేడ్ లో ఉంచారు. 

ఫ్లైట్ లెఫ్టినెంట్ శ్రీకాంత్ శర్మ 144-స్ట్రాంగ్ ఐఏఎఫ్ కాంటింజెంట్ ఆధ్వర్యంలో ప్రదర్శన నిర్వహించారు. 16 ఫైటర్ జెట్స్, 10 ట్రాన్స్ పోర్ట్ ఎయిర్ క్రాఫ్ట్, 19హెలికాప్టర్లతో పరేడ్ జరిగింది.