Virat Farewell : రాష్ట్రపతి అంగరక్షకుడు విరాట్ గుర్రానికి భావోద్వేగ వీడ్కోలు.. ప్రేమగా నిమిరిన మోదీ, కోవింద్

దేశరాజధాని ఢిల్లీలోని రాజ్‌పథ్‌లో 73వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా ముగిశాయి. ఈ పర్వదినాన రాష్ట్రపతి బాడీగార్డు విభాగానికి చెందిన అశ్వం విరాట్ (Virat) రిటైర్ అయ్యింది.

Virat Farewell : రాష్ట్రపతి అంగరక్షకుడు విరాట్ గుర్రానికి భావోద్వేగ వీడ్కోలు.. ప్రేమగా నిమిరిన మోదీ, కోవింద్

Virat Elite Horse President

Republic Day Virat bid farewell : దేశరాజధాని ఢిల్లీలోని రాజ్‌పథ్‌లో 73వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా ముగిశాయి. ఈ పర్వదినాన రాష్ట్రపతి బాడీగార్డు విభాగానికి చెందిన అశ్వం విరాట్ (Virat) రిటైర్ అయ్యింది. రాష్ట్రపతి అంగరక్షకుడు (PBG)లో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను తిరిగి రాష్ట్రపతి భవన్‌కు తీసుకెళ్లారు. అయితే పిబిజిలో ప్రత్యేక గుర్రం విరాట్ రిటైర్మెంట్ కూడా ఈరోజే కావడం విశేషం.. జనవరి 15న ఆర్మీ డే సందర్భంగా విరాట్‌కు చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ కమెండేషన్ లభించింది. అయితే అసాధారణమైన సేవతో పాటు సామర్థ్యాలు కలిగిన ఈ విరాట్ ప్రశంసలు అందుకున్న మొదటి గుర్రంగా నిలిచింది. రిపబ్లిక్ డే పరేడ్ ముగిసిన తర్వాత పీబీజీ (PBG) విరాట్ రిటైర్మెంట్ ప్రకటించింది.

ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ‘విరాట్‌’ను ప్రేమగా నిమిరారు. రాష్ట్రపతి రక్షణలో భాగంగా విరాట్ చేసిన సేవలను ఆయన కొనియాడారు. రాష్ట్రపతి బాడీగార్డ్ విభాగంలో ఈ అవార్డు అందుకున్న రెండో అశ్వం విరాట్ మాత్రేమ.. ఉత్తరాఖండ్‌లోని హెంపూర్‌లో ఉన్న రీమౌంట్ ట్రైనింగ్ స్కూల్ అండ్ డిపోలో విరాట్ కఠోర శిక్షణ పొందింది. మూడేళ్ల వయసులో రాష్ట్రపతి బాడీగార్డ్ విభాగంలో చేరింది. 2003లో రాష్ట్రపతి బాడీగార్డ్‌గా చేరింది. అప్పటి నుంచి ఇప్పటి వరకూ 13సార్లు రిపబ్లిక్ డే వేడుకల్లో పాల్గొంది.

రిపబ్లిక్ డే వేడుకల్లో రాష్ట్రపతికి ఎస్కార్ట్‌గా వ్యవహరించింది. రాష్ట్రపతి భవన్‌ను సందర్శించిన దేశాల అధినేతలకు ఈ అశ్వం ఆహ్వానం పలికింది. కవాతు సమయంలో విరాట్ అత్యంత విశ్వసనీయమైన గుర్రంగా పేరుగాంచింది. హనోవేరియన్ జాతికి చెందిన ఈ గుర్రం 2003లో అంగరక్షకుల్లో చేరింది. అప్పటి నుంచి రాష్ట్రపతి అంగరక్షకునిగా సేవలిందిస్తోంది. రాష్ట్రపతి రక్షణ దళంలో కీలక పాత్ర పోషించింది. ముద్దుగా ‘ఛార్జర్’ అని పిలుస్తారు. రామ్ నాథ్ కోవింద్‌తోపాటు.. ఆయన కంటే ముందు రాష్ట్రపతులుగా చేసిన వారి వద్ద సైతం విరాట్ పని చేసింది. పరేడ్‌లో అత్యంత నమ్మకమైన అశ్వంగా విరాట్ గుర్తింపు పొందింది.

200 మంది-బలమైన అశ్వికదళ యూనిట్, బ్రిటిష్ వైస్రాయ్‌ల నుంచి ఆధునిక-నాటి దేశాధినేతల వరకు భారతదేశంలోని అత్యంత ఉన్నతమైన VIPలకు శతాబ్దాలుగా కొనసాగుతోంది. ప్రతి గణతంత్ర దినోత్సవం సందర్భంగా.. గుర్రపు స్వారీలు, చక్కటి ఎరుపు రంగు కోట్లు, బంగారు కవచాలు, మెరుస్తున్న తలపాగాలు ధరించి అధ్యక్షుడిని వేదికపైకి తీసుకెళ్తుంది. ఆ సమయంలో జాతీయ గీతాన్ని ఆలపిస్తారు. మంచి ఎత్తు, ఆకర్షణీయమైన రూపంతో ఆకట్టుకునే విరాట్.. ఎంతో క్రమశిక్షణతో మెలుగుతుండేది.

వయసు మీదపడుతున్నా గత ఏడాది రిపబ్లిక్ డే పరేడ్, బీటింగ్ రీట్రీట్ సెర్మనీలో విరాట్ అద్భుత ప్రదర్శన చేసిందని అధికారి తెలిపారు. రైడర్ ఆదేశాలను పాటిస్తూ విరాట్ ఎంత ప్రశాంతంగా ఉండేదని ఏమాత్రం దురుసుగా ప్రవర్తించేది కాదని తెలిపారు. విరాట్‌కు వీడ్కోలు పలికే సమయంలో గుర్రంతో పాటు ఏళ్ల తరబడి పని చేసిన సిబ్బంది అంతా భావోద్వేగానికి లోనయ్యారు. ప్రధాని మోదీ, రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ సైతం విరాట్‌ను దగ్గరకు తీసుకొని ప్రేమగా నిమిరారు. దీనికి సంబంధించిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Read Also : Jio Phone 5G : జియో నుంచి అత్యంత చౌకైన 5G ఫోన్.. ఫీచర్లు లీక్.. ధర ఎంత ఉండొచ్చుంటే?