ఎంత గొప్ప మనస్సు: వీర జవాన్లకు విరాళంగా రూ.110 కోట్లు 

పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన వీర జవాన్లకు విరాళాలు ఇచ్చేందుకు దేశవ్యాప్తంగా ఎందరో ప్రముఖులు ముందుకొచ్చారు. ఓ యాచకురాలు బిచ్చం ఎత్తి కూడబెట్టిన రూ.6 లక్షలు అమర జవాన్ల కుటుంబాలకు విరాళంగా ఇచ్చింది.

  • Published By: sreehari ,Published On : March 5, 2019 / 06:55 AM IST
ఎంత గొప్ప మనస్సు: వీర జవాన్లకు విరాళంగా రూ.110 కోట్లు 

పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన వీర జవాన్లకు విరాళాలు ఇచ్చేందుకు దేశవ్యాప్తంగా ఎందరో ప్రముఖులు ముందుకొచ్చారు. ఓ యాచకురాలు బిచ్చం ఎత్తి కూడబెట్టిన రూ.6 లక్షలు అమర జవాన్ల కుటుంబాలకు విరాళంగా ఇచ్చింది.

పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన వీర జవాన్లకు విరాళాలు ఇచ్చేందుకు దేశవ్యాప్తంగా ఎందరో ప్రముఖులు ముందుకొచ్చారు. ఓ యాచకురాలు బిచ్చం ఎత్తి కూడబెట్టిన రూ.6 లక్షలు అమర జవాన్ల కుటుంబాలకు విరాళంగా ఇచ్చింది. ఓ స్కూల్ ప్రిన్సిపల్ తన బంగారు గాజులు అమ్మి మరి వీర జవాన్లకు లక్షన్నర రూపాయలను విరాళంగా ఇచ్చి దేశభక్తి చాటుకున్నారు.
Also Read: రూ.6 లక్షల బిక్షాటన డబ్బు.. అమర జవాన్లకు

ఇప్పుడు ముంబైకి చెందిన ముర్తజా ఎ అహ్మద్ (44) అనే వ్యాపారవేత్త అమరజవాన్ల కుటుంబాలకు తన వంతు సాయంగా రూ.110 కోట్లు పీఎం రిలీఫ్ ఫండ్ కు విరాళంగా ఇచ్చాడు. కోటా ప్రాంతానికి చెందిన హమీద్ ప్రభుత్వ కామర్స్ కాలేజీ నుంచి గ్రాడ్యువేట్ పూర్తి చేశాడు. ప్రస్తుతం ముంబైలో సైంటిస్ట్, రీసెర్చర్ గా పనిచేస్తున్నాడు. జవాన్లను కోల్పోయి అనాథలైన వారి కుటుంబాలకు విరాళాన్ని ఇవ్వాలని నిర్ణయించుకున్నట్టు ఓ జాతీయ మీడియాకు హమీద్ తెలిపాడు. 

ఈ మెయిల్ ద్వారా మోడీ అపాయింట్ మెంట్ కోరినట్టు చెప్పాడు. సైంటిస్ట్ గా తాను కనుగొన్న ‘ఫ్యుయల్ బర్న్ రేడియేషన్ టెక్నాలజీ’ (FBRT) ఆవిష్కరణ విషయంలో ప్రభుత్వం ఆలస్యంగా గుర్తించిందని ఈ సందర్భంగా హమీద్ తెలిపాడు. పుల్వామా ఉగ్రదాడి ఘటనకు ముందుగానే ఈ టెక్నాలజీ ఆవిష్కరించినట్టయితే ముందుస్తుగానే అప్రమత్తమై వీరజవాన్లను కాపాడుకుని ఉండేవాళ్లమని చెబుతున్నాడు.

ఫ్యుయల్ బర్న్ రేడియేషన్ టెక్నాలజీ ద్వారా.. జీపీఎస్, కెమెరా, ఎలాంటి టెక్నికల్ మిషనరీ అవసరం లేకుండానే వెహికల్స్ ను ట్రేస్ చేయొచ్చునని హమీద్ తెలిపాడు. 2016లోనే ఈ టెక్నాలజీ ఆవిష్కరణపై ప్రభుత్వానికి ఉచితంగా అందిస్తానని ఆఫర్ చేసినప్పటికీ ఆమోదం పొందలేదన్నాడు. 2018 అక్టోబర్ లో రెండేళ్ల తర్వాత ఎఫ్ బీఆర్ టీ టెక్నాలజీని ప్రభుత్వం ఆమోదించినట్టు హమీద్ చెప్పుకొచ్చాడు. 
Also Read: గాజులు అమ్మి.. అమర జవాన్లకు విరాళం