TS Governor Tamili : ‘తెలంగాణలో ఏం జరుగుతుందో అందరికీ తెలుసు..నేను ప్రత్యేకించి ప్రధానికి చెప్పనవసరం లేదు’..

‘తెలంగాణలో ఏం జరుగుతుందో అందరికీ తెలుసు..నేను ప్రత్యేకించి ప్రధానికి చెప్పనవసరం లేదు’ అని ప్రధాని మోడీతో భేటీ అనంతరం మీడియోకు తెలిపారు తమిళిసై

TS Governor Tamili : ‘తెలంగాణలో ఏం జరుగుతుందో అందరికీ తెలుసు..నేను ప్రత్యేకించి ప్రధానికి చెప్పనవసరం లేదు’..

Telangana Governor Tamilsai Meeting With Prime Minister Modi

ప్రధాని మోడీతో తెలంగాణ గవర్నర్ తమిళసై భేటీ అయ్యారు. మంగళవారం (ఏప్రిల్ 5,2022) రాత్రి తమిళిపై న్యూఢిల్లీకి వచ్చారు. ఈక్రమంలో బుధవారం తమిళిసై ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ అయ్యారు. తెలంగాణ బడ్జెట్ సమావేశాలకు టీఆర్ఎస్ ప్రభుత్వం గవర్నర్ ప్రసంగం లేకుండానే సమావేశాలను ప్రారంభించారు. బీజేపీ, టీఆర్ఎస్ మధ్య కొనసాగుతున్న మాటల యుద్ధం..వివాదం నేపథ్యంలో టీఆర్ఎస్ బడ్జెట్ సమావేశాలను గవర్నర్ తమిళిసై ప్రసంగం లేకుండానే సమావేశాలను కొనసాగించారు.దీనిపై తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఈక్రమంలో తెలంగాణ గవర్నర్ తమిళిసై ప్రధాని మోడీతో భేటీ కావటంతో వీరి సమావేశం ప్రాధాన్యతను సంతరించుకుంది. తమిళిసై తెలంగాణలో జరిగే పరిణామాలను ప్రధాని మోడీ దృష్టికి తీసుకువెళ్లి ఉంటారనే ప్రచారం జరుగుతోంది. దీంతో మోడీతో భేటీ అనంతరం మీడియా తమిళిసైను ప్రశ్నించింది. తెలంగాణలో జరిగే పరిణామాలను ప్రధాని దృష్టికి తీసుకువెళ్లారా?అని ప్రశ్నించారు మీడియా ప్రతినిధులు.

ఈ ప్రశ్నలకు సమాధానంగా గవర్నర్ తమిళిసై మాట్లాడుతూ..తెలంగాణలో ఏం జరుగుతుందో అందరికీ తెలుసు..నేను ప్రత్యేకించి ప్రధానికి చెప్పనవసరం లేదు..నేను రాజ్యాంగబద్దంగానే నడుచుకుంటాను అని స్పష్టం చేశారు. కోవిడ్ వ్యాక్సినేషన్ డ్రైవ్ ప్రక్రియను ప్రధాని మోడీ చాలా చక్కగా నిర్వహింపజేస్తున్నారని అందుకే ఒక డాక్టర్ గా ప్రధానికి కృతజ్ఞతలు తెలపటానికే భేటీ అయ్యాను అని తెలిపారు.కానీ.. తమిళిసై మాత్రం అన్ని వివరాలను ప్రధానికి తెలిపినట్లుగా సమాచారం. ప్రధానితో భేటీ అయిన తమిళిసై అమిత్ షాతో కూడా భేటీ అయ్యే అవకాశం ఉంది.

తెలంగాణలో పరిణామాలు..తెలంగాణ ప్రభుత్వానికి గవర్నర్ తమిళిపై సౌందర రాజన్ కు మధ్య గ్యాప్..
తెలంగాణ ప్రభుత్వానికి గవర్నర్ తమిళిపై సౌందర రాజన్ కు మధ్య అగాధం..పెరిగిపోతుంది. ఈ క్రమంలో ప్రధానితో తెలంగాణ గవర్నర్ గా ఉన్న తమిళిసై ప్రధాని మోడీతో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకొంది. తెలంగానలో చోటు చేసుకొన్న పరిణామాలపై కూడా ప్రధానికి తమిళిసై వివరించినట్లుగానే ఉంది. గత కొంతకాలంగా గవర్నర్ తమిళిసైకి తెలంగాణ ప్రభుత్వానికి మధ్య గ్యాప్ పెరుగుతూ వస్తోంది. ఈ విషయాలపై తెలంగాణ గవర్నర్ సమయం వచ్చినప్పుడల్లా వ్యాఖ్యలు చేస్తున్నారు.

ఇటీవల కూడా రాజ్ భవన్ తో టీఆర్ఎస్ ప్రభుత్వం అంటీముట్టనట్లు వ్యవహరిస్తోంది. టీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు గవర్నర్ పర్యటనలో కనీసం ప్రోటోకాల్ కూడా పాటించడం లేదు. ఇటీవల జరిగిన బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగం లేకుండా… సమావేశాలను ప్రారంభించారు. గవర్నర్ పర్యటనల్లో మంత్రలు దూరంగా ఉంటున్నారు. దీంతో గవర్నర్, ప్రభుత్వాన్ని మధ్య గ్యాప్ పెరిగినట్లు స్పష్టంగా తెలుస్తోంది. గవర్నర్ తమిళిసై కూడా పలు సందర్భాల్లో కీలక వ్యాఖ్యలు చేస్తున్నాను. నేను ఎవరికి తలవంచబోనని..కానీ రాజ్యాంగబద్దంగానే వ్యవహరిస్తాను అని ఇటీవల గవర్నర్ తమిళసై వ్యాఖ్యానించారు. అంతకుముందు కూడా పలు సందర్భాల్లో ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. ఈక్రమంలో ప్రధాని మోదీతో చర్చించే సమయంలో ఇవన్నీ ప్రస్తావనకు తెచ్చి ఉంటారనే అంతా భావిస్తున్నారు.

గణతంత్ర వేడులకు హాజరుకాని సీఎం కేసీఆర్, మంత్రులు..
2022 జనవరిలో నిర్వహించిన గణతంత్ర వేడుకలకు కూడా కేసీఆర్ సహా మంత్రులు హాజరు కాలేదు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగం లేకుండానే ప్రారంభమయ్యాయి. అయితే తొలుత బడ్జెట్ సమావేశాలు గవర్నర్ ప్రసంగం ఉంటుందని ప్రభుత్వం తనకు సమాచారం అందించిందని , ఆ తర్వాత పొరపాటున ఆ సమాచారం పంపారని ప్రభుత్వం నుండి సమాచారం వచ్చిందని తమిళిసై ప్రకటించింది. టెక్నికల్ అంశాన్ని సాకుగా చూపి గవర్నర్ ప్రసంగం లేకుండానే బడ్జెట్ సమావేశాలు నిర్వహించారని టీఆర్ఎస్ సర్కార్ పై విపక్షాలు విమర్శలు గుప్పించాయి. గవర్నర్ ప్రసంగం లేకండా బడ్జెట్ సమావేశాలు ప్రారంభించడాన్ని కూడా విపక్షాలు తప్పుబట్టాయి.

ఉగాది సంబరాలకు గవర్నర్ ఆహ్వానం..హాజరుకాని సీఎం కేసీఆర్..
రాజ్ భవన్ లో ఉగాది సంబరాలను గవర్నర్ నిర్వహించారు.ఈ సంబరాలకు కేసీఆర్ కు గవర్నర్ ఆహ్వానం పంపారు. అయితే ఈ సంబరాలకు కేసీఆర్ సహా మంత్రులు ఎవరూ కూడా హాజరు కాలేదు. సమ్మక్క సారలమ్మ జాతరకు హాజరైన గవర్నర్ కు మంత్రులు స్వాగతం పలకలేదు.ప్రోటోకాల్ పాటించలేదు. ఈ సందర్భాలను పురస్కరించుకొని ఉగాది సంబరాల సమయంలో తాను ఎవరికీ కూడా తల వంచబోనని తమిళిసై స్పష్టం చేశారు. కేసీఆర్ సహా మంత్రులకు ఆహ్వానం పంపిన విషయాన్ని కూడా ఆమె ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈ క్రమంలో ప్రధానితో గవర్నర్ తమిళిసై భేటీ కావటం అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది. ప్రధానితో భేటీ అయిన తమిళిసై కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ను కూడా కలిసి అవకాశం ఉంది.