తినడానికి వీలుగా ఉచితంగా రెస్టారెంట్‌లో జిప్ మాస్క్‌లు..

  • Published By: vamsi ,Published On : October 19, 2020 / 06:06 PM IST
తినడానికి వీలుగా ఉచితంగా రెస్టారెంట్‌లో జిప్ మాస్క్‌లు..

కరోనా కారణం నిత్య జీవితంలో మాస్క్‌లు అనేవి కచ్చితంగా ప్రతి ఒక్కరు ధరించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ కరోనా కష్టకాలంలో వివిధ రకాల మాస్క్‌లు మనకు మార్కెట్లో కనిపించాయి. కరోనా కాలూంలో దేశవ్యాప్తంగా కొన్ని నెలలుగా మూతపడ్డ హోటల్స్‌, రెస్టారెంట్లు అన్‌లాక్‌లో భాగంగా ఓపెన్ అవుతూ ఉన్నాయి. మరోవైపు కరోనా మహమ్మారి వ్యాప్తి రోజురోజుకు విపరీతంగా పెరిగిపోతూ ఉండగా.. వినియోగదారులకు రక్షణతోపాటు వారిని ఆకట్టుకునేందుకు కొన్ని రెస్టారెంట్లు వినూత్న ప్రయత్నాలు చేస్తున్నాయి. అందులో భాగంగా పశ్చిమ బెంగాల్‌ కోల్‌కొతాలోని ఒక రెస్టారెంట్‌ తమ కస్టమర్లకు జిప్‌ మాస్కులను ఉచితంగా అందించింది. దీనికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.



రెస్టారెంట్లలో తినాలంటే మాస్క్ తీసి తినే పరిస్థితి ఉండగా.. అది కాస్త కరోనా రావడానికి ఆస్కారం ఉన్న సమయం అని భావిస్తే… భయపడకుంగా మాస్క్ తొలిగించాల్సిన అవసరం లేకుండా.. మాస్క్ జిప్ మాత్రమే తొలగించి తినేందుకు వీలుగా ఈ మాస్క్ తయారు చేశారు. కోల్‌కతా రెస్టారెంట్‌లో ఈ రకమైన మాస్క్ ఇవ్వడమే కాక.. ఎక్కువ మందిని అనుమతించకుండా సామాజిక దూరం పాటించేలా జాగ్రత్తలు తీసుకుని రెస్టారెంట్‌ను ఓపెన్ చేసినట్లు రెస్టారెంట్ యజమాని సోమశ్రీ సేన్‌గుప్తా వెల్లడించారు.



ఈ రెస్టారెంట్ యజమాని సోమశ్రీ సేన్‌గుప్తా మాట్లాడుతూ.. మాస్క్ లేకపోతే కరోనా వచ్చే ప్రమాద తీవ్రతను దృష్టిలో ఉంచుకుని మేము ఈ మాస్క్‌లను సిద్ధం చేసాము. ఈ మాస్క్‌ను మేము వినియోగదారులకు ఉచితంగా అందిస్తున్నామని ఆయన చెప్పారు. అయితే, కచ్చితంగా వారి మాస్క్‌లనే వేసుకోవాలని పట్టుబట్టట్లేదని అన్నారు. తరచుగా, ప్రజలు ఇంటి నుంచి బయలుదేరేటప్పుడు మాస్క్‌లు ధరించడం మరచిపోతారు. బహిరంగ ప్రదేశాలకు వెళ్ళినప్పుడు కచ్చితంగా మాస్క్ అవసరం కాబట్టి.. ఈ దృష్ట్యా, ఈ రెస్టారెంట్ మాస్క్‌లు అందజేస్తుంది.