PM Modi : ఒమిక్రాన్ వేరియంట్‌పై మోదీ స‌మీక్ష‌..అంతర్జాతీయ ప్రయాణ ఆంక్షల ఎత్తివేతపై పునరాలోచించాలని సూచన

అంతర్జాతీయ విమాన సర్వీసులను డిసెంబర్-15 నుంచి పూర్తి స్థాయిలో పునరుద్ధరించాలని ఇటీవల తీసుకున్న నిర్ణయంపై పునరాలోచించాలని అధికారులను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదేశించారు.

PM Modi : ఒమిక్రాన్ వేరియంట్‌పై మోదీ స‌మీక్ష‌..అంతర్జాతీయ ప్రయాణ ఆంక్షల ఎత్తివేతపై పునరాలోచించాలని సూచన

Pm Modi2

PM Modi : అంతర్జాతీయ విమాన సర్వీసులను డిసెంబర్-15 నుంచి పూర్తి స్థాయిలో పునరుద్ధరించాలని ఇటీవల తీసుకున్న నిర్ణయంపై పునరాలోచించాలని అధికారులను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదేశించారు.

దక్షిణాఫ్రికాలో తాజాగా వెలుగుచూసిన కరోనా కొత్త వేరియంట్(ఒమిక్రాన్)​కు తీవ్రంగా వ్యాపించే లక్షణాలున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించిన నేపథ్యంలో భారత్​లో కరోనా పరిస్థితులు, వ్యాక్సినేషన్​పై ఉన్నతాధికారులతో శనివారం ప్రధాని మోదీ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశంలో కేంద్ర కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబా, కేంద్ర ఆరోగ్య కార్యదర్శి రాజేశ్ భూషణ్, నీతి ఆయోగ్(హెల్త్)​ సభ్యుడు వీకేపాల్​ సహా తదితరులు పాల్గొన్నారు.

ఈ సంద‌ర్భంగా ప్ర‌ధాని క‌రోనా కొత్త వేరియంట్ “ఒమిక్రాన్” గురించి అధికారులను వివ‌రాలు అడిగి తెలుసుకున్నారు మోదీ. ప్రపంచవ్యాప్తంగా ఈ వేరియంట్ వ్యాప్తి, వివిధ దేశాల్లోని పరిస్థితులపై మోదీకి అధికారులు వివరించారు. భారత్​పై ఈ వేరియంట్​ ప్రభావం ఎలా ఉండొచ్చని చర్చించారు. కొత్త వేరియంట్ వ్యాప్తి కట్టడికి తగిన చర్యలు చేపట్టాలని అధికారులను మోదీ ఆదేశించారు. అదేవిధంగా అధికారులకు కొన్ని స‌ల‌హాలు, సూచ‌న‌లు ఇచ్చారు.

క‌రోనా కొత్త వేరియంట్ నేప‌థ్యంలో రాష్ట్ర ప్ర‌భుత్వాల‌తో క‌లిసి ప‌నిచేయాల‌ని అధికారుల‌కు ప్ర‌ధాని మోదీ సూచించారు. అన్ని రాష్ట్రాల్లోనూ జిల్లా స్థాయిలో క‌రోనా న్యూ వేరియంట్‌పై అవ‌గాహ‌న క‌ల్పించాల‌న్నారు. అదేవిధంగా క‌రోనా కేసులు ఎక్కువ‌గా ఉన్న ప్రాంతాల్లో ప్ర‌జ‌లు నిబంధ‌న‌లు పాటించేలా చర్యలు, నిరంత‌ర నిఘాను కొన‌సాగించాల‌ని ప్ర‌ధాని ఆదేశించారు. విదేశాల నుంచి వ‌చ్చే ప్ర‌యాణికులు నిబంధ‌న‌ల మేర‌కు ప‌రీక్ష‌లు చేయించుకున్నారా లేదా అనే విష‌యంలో గ‌ట్టి ప‌ర్య‌వేక్ష‌ణ అవ‌స‌ర‌మ‌ని చెప్పారు. క‌రోనా ఉధృతంగా ఉన్న‌ దేశాల‌పై ప్ర‌ధానంగా దృష్టి సారించాల‌న్నారు. ప్రజలంతా మరింత జాగ్రత్తతో వ్యవహరించాలని, కరోనా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని మోదీ పేర్కొన్నారు.

ALSO READ Hebah Patel: ‘అబ్బా.. హెబ్బా’.. ఇన్‌స్టాలో హీటెక్కిస్తున్న పిక్స్