వీవీప్యాట్ స్లిప్పులు లెక్కించాలి సుప్రీంలో రివ్యూ పిటీషన్

  • Published By: veegamteam ,Published On : April 24, 2019 / 09:13 AM IST
వీవీప్యాట్ స్లిప్పులు లెక్కించాలి సుప్రీంలో రివ్యూ పిటీషన్

వీవీ ప్యాట్ స్లిప్పుల లెక్కింపులపై సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు అయింది. ఈమేరకు 21 పార్టీలు పిటిషన్ దాఖలు చేశాయి. 50 శాతం వీవీప్యాట్ స్లిప్పులు లెక్కించేలా ఈసీకి ఆదేశాలు ఇవ్వాలని కోరాయి. గతంలో 50 శాతం పెంచాలన్న పిటిషన్ పై సుప్రీంకోర్టు స్పందించింది. ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 5 వీవీ ప్యాట్ స్లిప్పులు లెక్కించాలని సుప్రీంకోర్టు ఈసీకి ఆదేశించింది. 50 శాతం తప్పనిసరిగా లెక్కించేలా ఆదేశాలివ్వాలని ప్రతిపక్షాలు రివ్యూ పిటిషన్ వేశాయి.

దేశవ్యాప్తంగా ఎన్నికలు జరుగుతున్న సందర్భంగా సుప్రీంకోర్టులో ఎన్నికలకు సంబంధించి అనేక పిటిషన్లు దాఖలు అవుతున్నాయి. అందులో భాగంగా వీవీ ప్యాట్ స్లిప్పుల లెక్కింపుపై గతంలో చంద్రబాబుతో సహా 21 పార్టీల నేతలు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 0.4 శాతం వీవీ ప్యాట్ స్లిప్పులను మాత్రమే లెక్కిస్తున్నారు. దాదాపు 9 వేల కోట్ల రూపాయల ఖర్చు అవుతుంది.. ప్రతిపక్ష పార్టీలక ఓటు షేర్ ఉంది. ప్రజలు ఎవరికి ఓటు వేశారన్నది తెలుసుకోవాలనుకుంటున్నారు కనుక పారదర్శకంగా ఈసీ ఉండాలంటే కచ్చితంగా వీవీ ప్యాట్ స్లిప్పులను లెక్కించాలని గతంలో ప్రతిపక్ష పార్టీలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి.

తక్కువ లెక్కించే కన్నా ఒక్కో నియోజకవర్గంలో 5 వీవీ ప్యాట్ లను ర్యాండమ్ గా ఎంచుకుని లెక్కించాలని సుప్రీంకోర్టు ఈసీకి ఆదేశాలు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఈ తీర్పును పున:సమీక్షించాలని, కచ్చితంగా 50 శాతం వీవీప్యాట్ స్లిప్పులు లెక్కించాలని ప్రతిపక్ష పార్టీల నేతలు మరోసారి సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ ఫైల్ చేశారు. వచ్చే వారం ఈ పిటిషన్ విచారణకు వచ్చే అవకాశం ఉంది. 

ఇప్పటికే ఒక అసెంబ్లీ నియోజకవర్గంలో 5, ఒక ఎంపీ నియోజకవర్గంలో 35 వీవీ ప్యాట్ స్లిప్పులను లెక్కించాల్సివుంటుంది. ఈమేరకు సుప్రీంకోర్టు ఈసీకి ఆదేశాలు కూడా జారీ చేసింది. అయితే వీవీ ప్యాట్ స్లిప్పులను లెక్కిస్తే గనుక వారం రోజుల సమయం పడుతుందని ఈసీ తెలిపింది. అయితే అంత సమయం పట్టదని ప్రతిపక్ష పార్టీలు సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉంది.

గతంలో అశోక్ మన్ సింగ్ ప్రతిపక్ష నేతల తరపున వాదనలు వినిపించారు. ఈసీ పారదర్శకంగా వ్యవహరించాలి, ప్రజలకు నమ్మకం కలిగించే విధంగా వ్యవహరించాల్సివుంటుందని గత విచారణ సందర్భంగా వాదనలు వినిపించారు. ప్రతిపక్షాలు దాఖలు చేసిన రివ్యూ పిటిషన్ పై ఈసీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, ఏ ఏ అంశాలను సుప్రీంకోర్టు ముందుకు తీసుకొస్తుందనేది వేచి చూడాలి మరి.