Revolt Motors : గుడ్ న్యూస్.. రివోల్ట్ ఆర్ వి – 400పై రూ. 28,000 తగ్గింపు

పెట్రోల్ ధరలు విపరీతంగా పెరుగుతుండటంతో చాలా మంది ఎలక్ట్రిక్ వాహనాలు కొనేందుకు ఇష్టపడుతున్నారు. దీంతో ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు ఊపందుకున్నాయి. అయితే వినియోగదారుల అభిరుచికి తగిన ఎలక్ట్రిక్ వెహికల్స్ చాలా తక్కువగా అందుబాటులో ఉన్నాయి. ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరిగి కొద్దీరోజులే అవుతుంది.. ఈ తక్కువ సమయంలో వినియోగదారులకు కావలసిన అన్ని సౌకర్యాలు ఉన్న వెహికల్ తయారు చేయడం కొంచం కష్టమే.. ఫీచర్లు తక్కువగా ఉన్నప్పటికీ చాలా కంపెనీలు అందుబాటు ధరతో వినియోగదారులను ఆకట్టుకుంటున్నాయి.

Revolt Motors : గుడ్ న్యూస్.. రివోల్ట్ ఆర్ వి – 400పై రూ. 28,000 తగ్గింపు

Revolt Motors 1

Revolt Motors : పెట్రోల్ ధరలు విపరీతంగా పెరుగుతుండటంతో చాలా మంది ఎలక్ట్రిక్ వాహనాలు కొనేందుకు ఇష్టపడుతున్నారు. దీంతో ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు ఊపందుకున్నాయి. అయితే వినియోగదారుల అభిరుచికి తగిన ఎలక్ట్రిక్ వెహికల్స్ చాలా తక్కువగా అందుబాటులో ఉన్నాయి. ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరిగి కొద్దీరోజులే అవుతుంది.. ఈ తక్కువ సమయంలో వినియోగదారులకు కావలసిన అన్ని సౌకర్యాలు ఉన్న వెహికల్ తయారు చేయడం కొంచం కష్టమే.. ఫీచర్లు తక్కువగా ఉన్నప్పటికీ చాలా కంపెనీలు అందుబాటు ధరతో వినియోగదారులను ఆకట్టుకుంటున్నాయి.

ఇక ఇదిలా ఉంటే ప్రముఖ ఎలక్ట్రిక్ బైక్స్ తయారి కంపెనీ రివోర్ట్ మోటర్స్ ఆర్ వి – 300, ఆర్ వి -400 పేరుతో రెండు ఎలక్ట్రిక్ బైకులను మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ ఎలక్ట్రికల్ బైక్స్ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌ ని కలిగి ఉన్నాయి. తమ బైక్స్ స్మార్ట్ గా ఉండాలనే ఆలోచనతో రివోర్ట్ కంపెనీ ఓ మొబైల్ యాప్ ని అభివృద్ధి చేసింది.. బైక్ లో ఏదైనా సాంకేతిక సమస్య ఏర్పడితే ఈ యాప్ ద్వారా తెలుసుకోవచ్చు. ఇక ప్రయాణ సమయంలో బైక్ ఎక్కడుందో తెలుసుకోవడంతోపాటు.. బైక్ పై వెళ్లే ప్రదేశాలను రికార్డు చెయ్యొచ్చు.

ఇక దీని అదనపు ఫీచర్ల విషయానికి వస్తే.. వాయిస్ కమాండ్ ఇవ్వడం ద్వారా దీనిని స్టార్ట్ చేయవచ్చు. ఈ బైక్ బ్యాటరీలను ఇంట్లో కానీ, ఆఫీసులో కానీ ఛార్జ్ చేసుకునేందుకు వీలుగా డిసైన్ చేశారు. ఆర్ వి – 300 ధర విషయానికి వస్తే కంపెనీ రూ .94,999గా నిర్ణయించింది. ఇక దీని బుకింగ్ కొరకు రూ.7,199లను అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. ఇక ఈ కంపెనీ ఎకో, నార్మల్, స్టార్ట్స్ అనే మూడు వేరువేరు మోడల్స్ ను మార్కెట్లోకి అందుబాటులోకి తెచ్చింది. ఆర్ వి-300లో 1.5 కిలోవాట్ల మోటారు, 2.7 కిలోవాట్ల బ్యాటరీని అమర్చారు. ఈ బైక్ టాప్ స్పీడ్ గంటకు 65 కిమీ.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 80 నుంచి 150 కిలో మీటర్ల వరకు ప్రయాణించవచ్చు.

ఈ బైక్ సీబీఎస్ బ్రేక్‌లు, ముందు భాగంలో 240 ఎంఎం డిస్క్, వెనుక వైపు 180 ఎంఎం డిస్క్ బ్రేక్ ఉన్నాయి. స్మోకీ గ్రే, నియాన్ బ్లాక్ రంగులలో లభిస్తుంది. ఇక ఆర్ వి – 400 గురించి చెప్పాలి అంటే ఇది ఒకసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 156 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు. దీనిపై గంటకు 85 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించవచ్చు. ఆర్ వి – 400లో 3 కిలోవాట్ల మోటార్, 3.24 కిలోవాట్ల లిథియం అయాన్ బ్యాటరీని అమర్చారు. ఈ బైక్ బుకింగ్ చేసుకోవాలంటే రూ.7,999 చెల్లించాలి. కేంద్ర ప్రభుత్వం ఫేమ్ పథకంలో సవరణ చేసిన తర్వాత రివాల్ట్ ఆర్ వి – 400 ధర భారీగా తగ్గించింది. ఇప్పుడు ఈ బైక్ ధర రూ.90,799 గా ఉంది. గతంలో రూ.1,25,000 ఉండగా దీనిపై రూ.28,000 తగ్గించంతో ధర లక్ష దిగువకు వచ్చింది.