Porn Link : 5వ తరగతి విద్యార్థుల వాట్సాప్ గ్రూప్‌లో పోర్న్ లింక్ పెట్టిన టీచర్

కొందరు టీచర్లు కీచకుల్లా మారుతున్నారు. కామంతో కళ్లు మూసుకుపోయి దారుణాలకు ఒడిగడుతున్నారు. నీచమైన పనులతో పవిత్రమైన ఉపాధ్యాయ వృత్తికి కళంకం తెస్తున్నారు. పిల్లలకు..

Porn Link : 5వ తరగతి విద్యార్థుల వాట్సాప్ గ్రూప్‌లో పోర్న్ లింక్ పెట్టిన టీచర్

Porn Link

Porn Link : గురువంటే దైవంతో సమానం. పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పి వారిని భావి పౌరులుగా తీరిదిద్దే బాధ్యత గురువులదే. పిల్లలు పెడదోవ పట్టకుండా సన్మార్గంలో పయనించేలా చూడాల్సింది కూడా టీచరే. అందుకే గురువన్నా ఉపాధ్యాయ వృత్తి అన్నా ఎంతో గౌరవం ఇస్తారు. అయితే కొందరు టీచర్లు కీచకుల్లా మారుతున్నారు. కామంతో కళ్లు మూసుకుపోయి దారుణాలకు ఒడిగడుతున్నారు. నీచమైన పనులతో పవిత్రమైన ఉపాధ్యాయ వృత్తికి కళంకం తెస్తున్నారు. పిల్లలకు విద్యాబుద్దులు నేర్పాల్పిన ఓ టీచర్ దారితప్పాడు. విద్యార్థుల వాట్సాప్ గ్రూప్ లో పోర్న్ లింక్ పెట్టాడు.

Oral Sex : ముఖ రతి నేరమే… అంత తీవ్రమైనది కాదు… అలహాబాద్ హై‌కోర్ట్

మహారాష్ట్రలోని రీవా జిల్లాలో ఈ ఘోరం జరిగింది. ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు కృపాకర్ చతుర్వేది 5వ తరగతి విద్యార్థుల వాట్సాప్ గ్రూప్ లో అశ్లీల వీడియో లింక్ షేర్ చేశాడు. దీంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు షాక్ తిన్నారు. ఈ వ్యవహారాన్ని వారు సీరియస్ గా తీసుకున్నారు. దీనిపై విద్యార్థుల తల్లిదండ్రులు జిల్లా విద్యాశాఖ అధికారికి ఫిర్యాదు చేశారు. లింక్ ను షేర్ చేసిన టీచర్ కృపాకర్ పై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాగా, ఆ గ్రూప్ లో జిల్లాలోని 28 పాఠాశాలలకు చెందిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, మహిళా టీచర్లు ఉన్నారు.

SBI కస్టమర్లకు ముఖ్య గమనిక.. వెంటనే ఆ పని చేయండి

కాగా, ఆశ్లీల లింక్ షేర్ చేసిన కాసేపటికే టీచర్ కృపాకర్ దాన్ని తొలగించాడు. సోషల్ మీడియా వేదికగా క్షమాణలు చెప్పాడు. అయితే కృపాకర్​ ఇలా చేయడం కొత్తేమీ కాదని, గతంలోనూ చాలాసార్లు ఇలాంటి లింక్​లు షేర్ చేశాడని గ్రూప్​లోని మరో టీచర్ ఆరోపించారు. అతడిని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.