RGV : ద్రౌపది జీ గొప్ప రాష్ట్రపతి అవుతారు.. బీజేపీకి నా ధన్యవాదాలు అంటూ వర్మ ట్వీట్..

తాజాగా రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది పై వర్మ‌ మరో ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ లో వర్మ.. ''గౌరవనీయులైన ద్రౌపది జీపై నేను విస్తృతమైన పరిశోధన చేశాను. ఆ పరిశోధనలో ఆమె కళ్ల తీవ్రత............

RGV : ద్రౌపది జీ గొప్ప రాష్ట్రపతి అవుతారు.. బీజేపీకి నా ధన్యవాదాలు అంటూ వర్మ ట్వీట్..

Rgv

Droupadi Murmu :  అన్ని విషయాల్లోనూ నేను ఉన్నాను అంటూ దూరిపోతారు ఆర్జీవీ. సినిమాలే కాదు రాజకీయాలు కూడా గెలుకుతాను అంటాడు వర్మ. ప్రతిసారి ఎదో ఒక కాంట్రవర్షియల్ ట్వీట్ చేసి వార్తల్లో నిలుస్తాడు. ప్రస్తుతం దేశంలో రాష్ట్రపతి ఎన్నిక గురించే చర్చ నడుస్తుంది. అధికార పక్షం నుంచి ద్రౌపది ముర్ము, ప్రతీకార పక్షం నుంచి యాశ్వంత్ సిన్హాని ఇప్పటికే రాష్ట్రపతి అభ్యర్థులుగా ప్రకటించారు.

 

రెండు రోజుల క్రితం వర్మ ద్రౌపది ముర్ము పై ట్వీట్ చేస్తూ.. ద్రౌపది ఉన్నారు, మరి కౌరవులు ఎవరు? పాండవులు ఎవరు అంటూ పోస్ట్ చేశాడు. అయితే ఈ ట్వీట్ వివాదానికి దారి తీసింది. పలువురు నాయకులు వర్మని విమర్శిస్తూ వ్యాఖ్యలు చేశారు. కొంతమంది పోలీస్ స్టేషన్ లో వర్మపై కేసులు కూడా పెట్టారు. ఆ తర్వాత వర్మ మహాభారతంలో ద్రౌపది క్యారెక్టర్ అంటే నాకు ఇష్టమని అంటూ ఏదో వివరణ ఇస్తూ మరో ట్వీట్ చేశాడు.

Ranbir Kapoor : ఆలియా నా మొదటి భార్య కాదు.. రణబీర్ వ్యాఖ్యలు..

తాజాగా రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది పై వర్మ‌ మరో ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ లో వర్మ.. ”గౌరవనీయులైన ద్రౌపది జీపై నేను విస్తృతమైన పరిశోధన చేశాను. ఆ పరిశోధనలో ఆమె కళ్ల తీవ్రత, ఆమె చిరునవ్వు మరియు ముఖ రూపురేఖలు, వాటిని చూస్తే అర్థమైపోతుంది ఆమె ప్రపంచం మొత్తంలో గొప్ప రాష్ట్రపతి అవుతారు. ఆమె స్మైల్ చూస్తే హార్ట్ లోంచి వచ్చినట్టు ప్యూర్ గా ఉంది. కౌరవులు, పాండవులు పక్కనపెడితే ఈ ద్రౌపదిని అందరూ కలిసి గెలిపించుకొని కొత్త మహాభారతం రాస్తారు. థ్యాంక్యూ బీజేపీ” అని పోస్ట్ చేశారు. వర్మ చేసిన ఈ ట్వీట్స్ మళ్ళీ రాజకీయాల్లో చర్చగా మారాయి.