Richest Minister: మంత్రుల్లో సంపన్నుడు ఈయనే

తమిళనాడులో డీఎంకే నేతృత్వంలో నూతన ప్రభుత్వం ఏర్పడిన విషయం తెలిసిందే.. తాజాగా డీఎంకేకి చెందిన 34 మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. ప్రమాణస్వీకార సమయంలో వీరి ఆస్తుల వివరాలను ప్రమాణపత్రంలో పొందుపరిచారు. వీరిలో సంపన్న మంత్రిగా రాణిపేట ఎమ్మెల్యే గాంధీ ఉన్నారు.

Richest Minister: మంత్రుల్లో సంపన్నుడు ఈయనే

Richest Minister

Richest Minister: తమిళనాడులో డీఎంకే నేతృత్వంలో నూతన ప్రభుత్వం ఏర్పడిన విషయం తెలిసిందే.. తాజాగా డీఎంకేకి చెందిన 34 మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. ప్రమాణస్వీకార సమయంలో వీరి ఆస్తుల వివరాలను ప్రమాణపత్రంలో పొందుపరిచారు. వీరిలో సంపన్న మంత్రిగా రాణిపేట ఎమ్మెల్యే గాంధీ ఉన్నారు.

గాంధీ దాఖలు చేసిన ప్రమాణపత్రంలో ద్వారా ఆయనే మంత్రివర్గంలో అత్యంత సంపన్నుడనే విషయం తెలుస్తుంది. తక్కువ ఆస్తులు కలిగిన మంత్రిగా పద్మనాభపురం ఎమ్మెల్యే మనో తంగరాజ్‌ ఉన్నారు. గాంధీ చేనేత, జౌళి, ఖాదీ, గ్రామ పరిశ్రమల బోర్డు మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఈయన ఆస్తుల విలువ 47.94 కోట్లుగా ఉంది.

అప్పుల్లో కూడా గాంధీనే మొదటి స్థానంలో ఉన్నారు. ఈయనకు రూ.14.46 కోట్లు అప్పులు ఉన్నట్లుగా ప్రమాణస్వీకార పత్రంలో పేర్కొన్నారు. మంత్రి వర్గంలో రూ.23.39 లక్షలు మాత్రమే ఆస్తులు ఉన్నట్లు ఐటీ మంత్రి మనో తంగరాజ్ చూపించారు. ఈయనే తమిళనాడు మంత్రి వర్గంలో అతి తక్కువ ఆస్తులు ఉన్న మంత్రిగా నిలిచారు. ఇక తమిళనాడు మంత్రి వర్గంలో 31 మంది కోటీశ్వరులే ఉన్నారు.