Fact check: అరెస్టైన రెజ్లర్లపై రైట్ వింగ్ మార్ఫ్‭డ్ ఫొటోలు.. సోషల్ మీడియాలో వైరల్

కొత్త పార్లమెంటు భవనాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించిన ప్రదేశానికి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న జంతర్ మంతర్ వద్ద నిరసన ప్రదేశంలో గందరగోళం ఏర్పడింది. పార్లమెంట్ భవనం వైపుకు ర్యాలీకి ప్రయత్నించారు రెజ్లర్లు. ఆ సందర్భంలోనే పోలీసులకు రెజ్లర్లకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది

Fact check: అరెస్టైన రెజ్లర్లపై రైట్ వింగ్ మార్ఫ్‭డ్ ఫొటోలు.. సోషల్ మీడియాలో వైరల్

Fact check: రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్‌ఐ) చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేస్తూ కొంత కాలంగా నిరసన చేస్తున్న రెజ్లర్లను ఆదివారం అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అయితే అరెస్ట్ చేసి బస్సులో తీసుకెళ్తుండగా సంగీతా ఫోగట్, వినేష్ ఫోగట్‌ నవ్వుతూ సెల్ఫీ తీసుకున్నట్లు ఉన్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వాస్తవానికి ఇవి ఒరిజినల్ ఫొటోలు కావు. అరెస్టైన అనంతరం, పోలీసులు తమను తీసుకెళ్తున్న సందర్భంలో తీసుకున్న ఫొటోలను రైట్ వింగ్ ఎడిటింగ్ చేసిందని రెజ్లర్ బజరంగ్ పునియా తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు.


బజరంగ్ పునియా రెండు ఫోటోలను ట్వీట్ చేస్తూ – ‘‘ఒకటి మార్ఫింగ్, మరొకటి నిజమైనది. ఏంటిది? సంగీతా ఫోగట్చ, వినేష్ ఫోగట్ నవ్వుతూ కనిపించలేదు. ఐటీ సెల్ వ్యక్తులు ఈ తప్పుడు చిత్రాన్ని ప్రచారం చేస్తున్నారు. ఈ నకిలీ చిత్రాన్ని పోస్ట్ చేసిన వారిపై ఫిర్యాదు నమోదు చేస్తాం’’ అని ట్వీట్ చేశారు. కొత్త పార్లమెంటు భవనాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించిన ప్రదేశానికి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న జంతర్ మంతర్ వద్ద నిరసన ప్రదేశంలో గందరగోళం ఏర్పడింది. పార్లమెంట్ భవనం వైపుకు ర్యాలీకి ప్రయత్నించారు రెజ్లర్లు. ఆ సందర్భంలోనే పోలీసులకు రెజ్లర్లకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అనంతరం, రెజ్లర్లను బలవంతంగా అరెస్ట్ చేశారు. అనంతరం జంతర్ మంతర్ వద్ద నిరసన ప్రదేశాన్ని సైతం తొలగించారు.