రిహన్నా పాకిస్తానీనా ? ముస్లిమా ? నెటిజన్ల సెర్చ్

రిహన్నా పాకిస్తానీనా ? ముస్లిమా ? నెటిజన్ల సెర్చ్

Rihanna Muslim : ఢిల్లీలో రైతులు చేస్తున్న ఉద్యమం మరింత ఉధృతమౌతోంది. పలువురు వీరి పోరాటానికి మద్దతు తెలియచేస్తున్నారు. ప్రముఖ పాప్ సింగర్ రిహన్నా చేసిన ట్వీట్ తో ఒక్కసారిగా పరిస్థితి మారిపోయింది. భారత్ లో మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయచట్టాలకు వ్యతిరేకంగా రైతులు ఆందోళనలు చేస్తున్నారు. రైతులకు మద్దతుగా ఆమె ట్వీట్ చేశారు. మనం ఎందుకు దీని కోసం మాట్లాడకూడదు అంటూ ఫార్మర్స్ ప్రొటెస్ట్ హ్యాష్ ట్యాగ్ ను..ఓ మీడియాలో ప్రచురితమైన వార్తను జోడిస్తూ..పోస్టు పెట్టారు.

ట్వీట్ చేయడంతో రిహన్నా ట్రెండింగ్ గా మారిపోయారు. ఆమెకు కొంతమంది మద్దతు తెలియచేస్తే..మరికొంతమంది పూర్తి అవగాహన తెచ్చుకున్న తర్వాత స్పందించాలని హితవు పలికారు.
ఇదిలా ఉంటే…ఈమె ఎవరు, ఎక్కడుంటారు తదితర విషయాల గురించి తెలుసుకోవాలని నెటిజన్లు ప్రయత్నించారు. గాయని గురించి మొదటిసారి వినడంతో..చాలా మంది ఉత్సుకతతో గూగుల్ లో సెర్చ్ చేయడం ప్రారంభించారు. రిహన్నా ఎవరనే విషయంతో పాటు..ఆమె మతం ఏంటీ ఎక్కువ శోధించారు. రిహన్నా పాకిస్తానీనా ? ముస్లిమా కాదా అన్న విషయాన్ని ఎక్కువగా సెర్చ్‌ చేశారు. రైతుల నిరసనల గురించి ట్వీట్ చేసిన అనేక ఇతర అంతర్జాతీయ వ్యక్తులు గ్రేటా థన్‌బెర్గ్, హసన్ మిన్హాజ్, లిల్లీ సింగ్, జాన్ కుసాక్, అమండా సెర్నీ, మియా ఖలీఫా గురించి సెర్చ్‌ చేశారు.