RIP CDS General Bipin Rawat : నిజమైన దేశభక్తుడు బిపిన్ రావత్..ప్రముఖుల సంతాపం

హెలికాప్టర్​ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన త్రివిధ దళాధిపతి జనరల్​ బిపిన్​ రావత్​, ఆయన భార్య మధులిక సహా 11 మంది సాయుధ బలగాల మృతదేహాలు గురువారం సాయంత్రంలోగా ఢిల్లీ చేరుకోనున్నట్లు

RIP CDS General Bipin Rawat : నిజమైన దేశభక్తుడు బిపిన్ రావత్..ప్రముఖుల సంతాపం

Ar

RIP CDS General Bipin Rawat :  హెలికాప్టర్​ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన త్రివిధ దళాధిపతి జనరల్​ బిపిన్​ రావత్​, ఆయన భార్య మధులిక సహా 11 మంది సాయుధ బలగాల మృతదేహాలు గురువారం సాయంత్రంలోగా ఢిల్లీ చేరుకోనున్నట్లు అధికారులు తెలిపారు.

తమిళనాడు హెలికాప్టర్​ ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ విచారం వ్యక్తం చేశారు. జనరల్​ బిపిన్​ రావత్​, ఆయన భార్య, సైనికుల మరణాలపై సంతాపం ప్రకటించారు. అత్యంత శ్రద్ధతో వారంతా దేశ సేవ చేశారని కొనియాడారు. జనరల్​ బిపిన్​ రావత్​.. సీడీఎస్​గా దేశానికి విశేష సేవలందించారని మోడీ అన్నారు.

మోదీ ఓ ట్వీట్ లో..”జనరల్ బిపిన్ రావత్ అద్భుత సైనికుడు. నిజమైన దేశభక్తుడు. ఆయన మన సాయుధ బలగాలను, భద్రతా యంత్రాంగ ఆధునీకీకరణలో దోహదపడ్డారు. వ్యూహాత్మక విషయాలపై ఆయన ఆలోచనలు అసాధారణం. ఆయన మృతి నన్ను తీవ్రంగా కలచివేసింది. ఓం శాంతి”అని ట్వీట్ లో మోదీ పేర్కొన్నారు.

బిపిన్ రావత్ దంపతులు, మరో 11 మంది మరణంపై రక్షణ మంత్రి రాజ్​నాథ్​ సింగ్​ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బిపిన్ మరణం.. దేశ సాయుధ దళాలకు తీరని లోటు అని ట్వీట్ చేశారు.

బిపిన్ రావత్ మరణం పట్ల విచారం వ్యక్తం చేశారు కేంద్ర హోం మంత్రి అమిత్​ షా. ఇదో బాధాకరమైన రోజుగా అభివర్ణించారు. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. హెలికాప్టర్​ ప్రమాదంలో ప్రాణాలతో బయటపడి చికిత్స పొందుతున్న.. గ్రూప్​ కెప్టెన్​ వరుణ్​ సింగ్​ త్వరగా కోలుకోవాలని షా ఆకాంక్షించారు.

జనరల్​ బిపిన్​ రావత్​ మరణంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు కాంగ్రెస్​ నేత రాహుల్​ గాంధీ. ఈ కష్ట సమయంలో.. తమ ఆలోచనలన్నీ బాధిత కుటుంబాల వెంటే ఉన్నాయన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

దేశం తన ధైర్యవంతులైన కుమారుల్లో ఒకరిని కోల్పోయింది అని సిడిఎస్ జనరల్ బిపిన్ రావత్ మృతి పట్ల రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ సంతాపం తెలిపారు.

తమిళనాడులోని కూనూర్‌లో జరిగిన హెలికాప్టర్‌ ప్రమాదంలో చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌ జనరల్‌ బిపిన్‌ రావత్‌, ఆయన భార్య, ఇతర సాయుధ బలగాల మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యామని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఓ ట్వీట్ లో తెలిపారు.
ALSO READ Army Chopper Crash : భారత తొలి త్రివిధ దళాధిపతి బిపిన్ రావత్ మృతి..20ఏళ్లకే ఆర్మీలో చేరి..