Terrorists in Ukraine: జమ్మూ కశ్మీర్లో డ్రోన్స్, మారణాయుధాలతో రెచ్చిపోతున్న ఉగ్రవాదులు: ఒకే రోజు నాలుగు ఉగ్రదాడులు

2021 ఏడాదికి గానూ..ఏకే సిరీస్ ఆయుధాలు, పిస్టల్స్, రాకెట్ లాంచర్లు, బాంబులు మరియు హ్యాండ్ గ్రెనేడ్‌లు మరియు మందుగుండు సామగ్రిని భారీగా స్వాధీనం చేసుకున్నారు భద్రతా దళాలు

Terrorists in Ukraine: జమ్మూ కశ్మీర్లో డ్రోన్స్, మారణాయుధాలతో రెచ్చిపోతున్న ఉగ్రవాదులు: ఒకే రోజు నాలుగు ఉగ్రదాడులు

Kashmir

Terrorists in Ukraine: జమ్మూ కశ్మీర్ లో ఉగ్రవాదులు నానాటికీ రెచ్చిపోతున్నారు. భద్రతా దళాలు నిఘా కళ్లుగప్పి పలు ప్రాంతాల్లో నక్కివున్న ఉగ్రవాదులు పాకిస్తాన్ నుంచి డ్రోన్ల ద్వారా అందుతున్న ఆయుధ, మందుగుండు సామగ్రితో భారత్ లో దాడులకు పాల్పడుతున్నారు. సోమవారం ఒక్కరోజే కశ్మీర్లోని పలు ప్రాంతాల్లో నాలుగు చోట్ల ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. ఇటీవల కాలంలో ఉగ్రవాదులు కార్యకలాపాలు ఎక్కువయ్యాయని అధికారులు పేర్కొన్నారు. ఉగ్రవాద కార్యకలాపాలపై ఇటీవల విడుదల చేసిన నివేదిక ప్రకారం 2021 ఏడాదికి గానూ..ఏకే సిరీస్ ఆయుధాలు, పిస్టల్స్, రాకెట్ లాంచర్లు, బాంబులు మరియు హ్యాండ్ గ్రెనేడ్‌లు మరియు మందుగుండు సామగ్రిని భారీగా స్వాధీనం చేసుకున్నారు భద్రతా దళాలు. కశ్మీర్ లోయలో శాంతిభద్రతలకు భంగం కలిగించేందుకు ఈ ఆయుధాలను పాకిస్థాన్‌కు చెందిన ఉగ్రవాద సంస్థలు పంపినట్లు అనుమానిస్తున్నారు.

Also read:XE recombinants virus : కరోనా కొత్త వైరస్ ‘XE Omicron’ లక్షణాలివే..!

స్వాధీనం చేసుకున్న సామాగ్రి అంత ఇటీవలి కాలంలో చొరబాటు ప్రయత్నాల సమయంలో అడ్డగించిన లేదా సరిహద్దు నుండి కొన్ని మీటర్ల దూరంలో కనుగొనబడ్డాయి. ఈ ఏడాది ఫిబ్రవరి చివరి నాటికే 50 ఆయుధాలు, దాదాపు 700 రౌండ్ల మందుగుండు సామాగ్రి, 6 డిటోనేటర్లు మరియు 5 కిలోల పేలుడు పదార్థాలను సరిహద్దు వెంబడి భద్రతా దళాలు స్వాధీనం చేసుకున్నాయి. 2021లో, ముఖ్యంగా అక్టోబరులో, కశ్మీర్లో పౌరులు, భద్రతా బలగాల సిబ్బందిపై ఉగ్రవాదులు జరిపిన వరుస దాడులతో కశ్మీర్ లోయలో అల్లకల్లోలం ఏర్పడింది. ఎన్నడూ లేనంతగా గత రెండేళ్లలో ఉగ్రవాదుల నుంచి స్వాధీనం చేసుకున్న పిస్టల్స్ లో 250% పెరుగుదల కనిపించింది.

Also read:The Kashmir Files: ది కశ్మీర్ ఫైల్స్… 1990ల నాటి పరిస్థితులు వచ్చాయా..?

2019లో మొత్తం 35 పిస్టల్‌లను BSF స్వాధీనం చేసుకోగా, ఇది 2021లో 92కి చేరుకుంది. 2019, 2020లో, AK సిరీస్‌ తుపాకులలో ఉపయోగించే 483 మందుగుండు సామగ్రిని బీఎస్ఎఫ్ బలగాలు స్వాధీనం చేసుకోగా..2021లో ఈసంఖ్య మూడింతలు పెరిగి 1,287 రౌండ్ల మందుగుండు సామగ్రిని సైన్యం స్వాధీనం చేసుకుంది. ఉగ్రవాదులకు ఈ ఆయుధాలన్నీ డ్రోన్స్ ద్వారా పాకిస్తాన్ నుంచి అందుతున్నట్లు భారత భద్రతా దళాలు పేర్కొన్నాయి. భారీగా ఆయుధాలు సమకూర్చుకుంటున్న ఉగ్రవాదులు కశ్మీర్ లోని పౌరులపైనా, భద్రతా సిబ్బందిపైనా దాడులకు తెగబడుతున్నారు. గడిచిన 24 గంటల్లో శ్రీనగర్‌లోని మైసుమా ప్రాంతంలో ఉగ్రవాదుల ఏరివేత సమయంలో జరిగిన దాడుల్లో ఒక సీఆర్పీఎఫ్ జవాన్ మృతి చెందగా..మరొకరు గాయపడ్డారు. సోమవారం సాయంత్రం ఒక కశ్మీర్ పండిట్ ను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు.

Also read:Jammu Kashmir: కశ్మీర్‌లో రెచ్చిపోయిన ఉగ్రవాదులు