corona deaths : బతకటానికి ఆక్సిజన్ లేదు..చనిపోతే.. కాల్చటానికి కట్టెలు లేవు..

భారత్ లో పెరుగుతున్న కరోనా మరణాలతో దేశం అల్లాడిపోతోంది. కరోనా వస్తే ఆస్పత్రిలో బెడ్స్ దొరకని పరిస్థితి. దొరికినా ఆక్సిజన్ లేని దుస్థితి. దీంతో రోజు రోజుకు కరోనా మరణాలు పెరుగుతున్నాయి. ఈక్రమంలో మృతదేహాలను కాల్చటానికి కట్టెలు కూడా కొరతగా ఉన్న దారుణ పరిస్థితులు. బతకటానికి ఆక్సిజన్ లేదు..ఛస్తే కాల్చటానికి కట్టెలు లేవు అనే పరిస్థితి దేశంలో ఉంది.

corona deaths : బతకటానికి ఆక్సిజన్ లేదు..చనిపోతే.. కాల్చటానికి కట్టెలు లేవు..

Man Eating Half Burnt Corpse Of Covid Patient (1)

Rising corona deaths due to lack of oxygen : భారతదేశంలో కరోనావైరస్ సెకండ్ వేవ్ తీవ్రత ఎంతగా ఉందంటే..బతకటానికి ఆక్సిజన్ లేదు. ఛస్తే కాల్చటానికి కట్టెలు లేవు అన్నట్లుగా ఉంది. కరోనా మహమ్మరి ఉచ్చులో పడి జనాలు గిలగిలలాడుతున్నారు. శ్వాస ఆడటం లేదు. బతకటానికి ఆక్సిజన్ కూడా లేదు. ఆక్సిజన్ కొరత.. కొరత..కొరత. ఎక్కడ విన్నా ఇదే మాట. బాధితులు బతకటానికి అవసరమైన ఆక్సిజన్ లేదు..దీంతో ప్రజల ప్రాణాలు పిట్టల్లా రాలిపోతున్నాయి. ఆ తరువాత మృతదేహాల్ని కాల్చటానికి (దహనం) కట్టెలు కూడా లేని అత్యంత దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయి. కరోనా వస్తే ఇక చచ్చిపోవాల్సిందేనట్లుగా ఉంది పరిస్థితి. హాస్పిటల్ లో బెడ్స్ లేవు. బెడ్స్ ఉన్నా ఆక్సిజన్ లేదు. ఛస్తే కాల్చటానికి కట్టెలుకూడా లేవు. ఇదీ భారత్ లో ఉన్న కరోనా దారుణపరిస్థితులు. మృతులకు అంతిమ సంస్కారాలు చేసేందుకూ చోటు కూడా దొరకని పరిస్థితి ఉందీ అంటేకరోనా కల్లోలం ఎంత తీవ్రంగా ఊహించుకుంటేనే గుండెలు హడలిపోతున్నాయి. వీటితో పాటు మందుల కొరత కూడా కొనసాగుతోంది.

36గురువారం (ఏప్రిల్ 29,2021) కరోనా కొత్త కేసులు 3,79,257 నమోదయ్యాయి. వీటితో పాటు మరణాల సంఖ్య కూడా పెరిగింది. గురువారం ఒక్క రోజులోనే 3.645 మంది ప్రాణాలు కోల్పోయారు. మరోపక్క కరోనా లక్షణాలు ఉన్నవారు కోవిడ్ పరీక్షల ఫలితాలు రాకపోవటం వల్ల, టెస్టింగ్ చేయించుకోవడానికి అవకాశం దొరకకపోవడం వల్ల కేసుల సంఖ్య అధికారిక గణాంకాల కంటే ఎక్కువే ఉండొచ్చని అంచనా.అలాగే కరోనా మరణాల విషయంలో కూడా అదే జరుగుతోంది. గ్రామీణ ప్రాంతాల్లో కంటే పట్టణాల్లోనే కరోనా మరణాలు ఎక్కువగా ఉండటం గమనించాల్సిన విషయం.

12

ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీ ఆసుపత్రుల బయటే జనాలు మరణిస్తున్న పరిస్థితులు. ఆస్పత్రిలో చేరదామని వస్తే బెడ్స్ దొరక్క నడి రోడ్లమీదనే ఉండాల్సి వస్తోంది. భారతదేశంలో ఇప్పటి వరకు 1.8 కోట్ల మంది ప్రజలు కరోనా బారిన పడగా 2 లక్షల మందికి పైగా మరణించినట్లుగా తెలుస్తోంది. దేశంలోని ఆసుపత్రులలో కోవిడ్ రోగులకు చికిత్స చేసేందుకు తగినన్ని క్రిటికల్ కేర్ బెడ్‌లు లేవు. దీంతో..ఆసుపత్రిలో ఒక బెడ్ సంపాదించడానికి బాధితుల కుటుంబాలు మైళ్ల దూరం ప్రయాణం చేయాల్సివస్తోంది. 2 కోట్ల జనాభా ఉన్న ఢిల్లీ నగరంలో ఆసుపత్రులన్నీ పేషెంట్లతో నిండిపోయాయి.దీంతో కొత్తగా ఎవరినీ చేర్చుకోని పరిస్థితి. దీంతో ఆస్పత్రిలో చేరదామని మైళ్ల కొద్దీ దూరం నుంచి వచ్చినవారు కూడా ఢిల్లీ లోని ఆసుపత్రుల బయట ఉండే వీధులు పడి ఉండాల్సి వస్తోంది. బెడ్ దొరకకపోతుందా? అని ఆశగా ఎదురు చూస్తున్నారు బాధితులు..వారి కుటుంబ సభ్యులు.దీంతో కరోనా రోగులతో ఢిల్లీలోని ఆస్పత్రి చుట్టుపక్కల రోడ్లు నిండిపోయాయి. వారికి స్ట్రెచర్, ఆక్సిజన్ కానీ అందించటానికి ఆసుపత్రిలో చోటు సంపాదించటానికి ఆసుపత్రి వర్గాలను బతిమాలుతున్న దృశ్యాలు కన్నీరు తెప్పిస్తున్నాయి.

20

బెడ్ దొరికినా అందుబాటులో లేని ఆక్సిజన్
దేశ వ్యాప్తంగా దాదాపు అన్ని ఆసుపత్రుల్లో ఆక్సిజన్ కొరత ఉంది. కొన్ని ఆస్పత్రులైతే తమ దగ్గర ఆక్సిజన్ అందుబాటులో లేదని బోర్డులు కూడా పెడుతున్నాయి. ప్రస్తుతం దేశంలో ఆక్సిజన్ డిమాండ్ మరే ఇతర దేశాల్లోనూ లేనంతగా ఉందని పాత్ (పీఏటీహెచ్) ఆక్సిజన్ నీడ్స్ ట్రాకర్ వెల్లడించింది.

4

ఆక్సిజన్ కొరత గురించి దిల్లీలోని మణిపాల్ ఆసుపత్రి కోవిడ్ వార్డులో పనిచేసే డాక్టర్ హర్జిత్ సింగ్ భట్టి మాట్లాడుతూ.. ప్రజలు ఆక్సిజన్ కోసం అల్లాడిపోతున్నారనీ..వారి పరిస్థితి చూసి కూడా మేం ఏమీ చేయలేకపోతున్నందుకు చాలా బాధగా ఉందని నీళ్ల నుంచి గట్టుమీద పడ్డ చేపల్లా బాధితుల పరిస్థితి ఉందని తెలిపారు. ఆక్సిజన్ దొరకక..అల్లాడిపోతూ రోడ్లపైనే ప్రజలు ప్రాణాలు వదులుతున్నారని తెలిపారు.

6

సాధారణ పరిస్థితుల్లో భారత్‌లో ఉత్పత్తయ్యే ఆక్సిజన్‌లో 15 శాతమే హెల్త్ కేర్ రంగంలో వాడుతారు, మిగతాదంతా పారిశ్రామిక అవసరాలకే వాడేవారు. కానీ ఇప్పుడా పరిస్థితి లేదు. కరోనా కేసులు గంటగంటకూ పెరుగుతున్న క్రమంలో దేశంలో ఆక్సిజన్ ఉత్పత్తి పూర్తి సామర్థ్యం మేరకు జరుగుతున్నా అదంతా వైద్య అవసరాలకే పరిపోవట్లేదు. దేశంలో రోజుకు సుమారు 7,500 టన్నుల ఆక్సిజన్ తయారవుతుంటే అదంతా వైద్య అవసరాలకే వినియోగాల్సి వస్తోందని వైద్య, ఆరోగ్య రంగానికి చెందిన సీనియర్ అధికారి రాజేశ్ భూషణ్ తెలిపారు.

52

సామూహికంగా దహన సంస్కారాలు
భారత్ లో కరోనా మరణాలు రోజురోజుకు పెరుగుతుండటంతో సామూహిక దహన సంస్కారాలు నిర్వహించడానికి తాత్కాలిక ప్రదేశాలు కూడా ఏర్పాటు చేస్తున్నారు. కరోనా మృతులకు దహన సంస్కారాలు చేయటానికి సిబ్బంది రాత్రి పగలు కూడా పనిచేయాల్సి వస్తోంది. అయినా ఇంకా మృతదేహాలు మిగిలే ఉంటున్నాయి అంటే పరిస్థితి ఎంత భయంకరంగా ఉందో ఊహించుకోవచ్చు. శవాలను అంత్యక్రియలు చేయటానికి శ్మశానాలు కూడా చాలటంలేదు. దీంతో ఒక భవనం కారు పార్కింగ్‌లో దహన సంస్కారాలకు ఏర్పాట్లు చేసిన ఘటనలు ఉన్నాయి.

10

లెక్కలేనన్ని శవాలు రావడంతో ఈశాన్య దిల్లీలో దహన వాటిక కేంద్రాన్ని నడుపుతున్న ఒక స్వచ్చంద సంస్థ అధిపతి జితేందర్ సింగ్ షన్టీ దహన వాటికకు పక్కనే ఉన్న కారు పార్కింగ్ లో కూడా దహన సంస్కారాలు నిర్వహించారు. దీని గురించి ఆయన మాట్లాడుతూ..ఇటువంటి దారుణ పరిస్థితులు చూడటానికి మనస్సు ద్రవించిపోతోంది. ఇంకా దారుణం ఏమిటంటే..చాలా ప్రాంతాల్లో శవాలను కాల్చేందుకు కట్టెలు కూడా దొరకటం లేదని ఆవేదనగా తెలిపారు.

26

ఇంత దారుణమైన పరిస్థితిని గతంలో ఎప్పుడూ చూడలేదని ఒక దహన వాటిక దగ్గర సహాయ చర్యలు చేపడుతున్న మరో వ్యక్తి తెలిపారు. ఇది మన భారత దేశమేనా? ఇది దేశ రాజధానిలో ఉన్నామనే విషయాన్ని నమ్మలేకపోతున్నామని వాపోతున్నారు. ప్రజలకు ఆక్సిజన్ దొరకక చనిపోతున్నారు..వారి చనిపోయిన తరువాత కూడా వారిని కాల్చటానికి కట్టెలు కూడా దొరకని దీన స్థితిలో ఉన్నామని వాపోయారు.