Petrol-Diesel Prices : మళ్లీ పెరిగిన చమురు ధరలు.. రూ.105కు చేరువలో పెట్రోల్..!

దేశంలో రోజురోజుకీ పెట్రోల్, డీజిల్ ధరలు మండిపోతున్నాయి. కొవిడ్-19 మహమ్మారి సమయంలో దేశవ్యాప్తంగా ఇందన ధరలు రికార్డు స్థాయిలో పెరిగిపోతున్నాయి. దాంతో భారత ఆర్థిక వ్యవస్థ కోలుకోవడం, ద్రవ్యోల్బణ ఒత్తిళ్లను ఎదుర్కొవడం సవాల్ మారుతోంది.

Petrol-Diesel Prices : మళ్లీ పెరిగిన చమురు ధరలు.. రూ.105కు చేరువలో పెట్రోల్..!

Rising Petrol, Diesel Prices Pose Challenge

Petrol-Diesel Prices : దేశంలో రోజురోజుకీ పెట్రోల్, డీజిల్ ధరలు మండిపోతున్నాయి. కొవిడ్-19 మహమ్మారి సమయంలో దేశవ్యాప్తంగా ఇందన ధరలు రికార్డు స్థాయిలో పెరిగిపోతున్నాయి. దాంతో భారత ఆర్థిక వ్యవస్థ కోలుకోవడం, ద్రవ్యోల్బణ ఒత్తిళ్లను ఎదుర్కొవడం సవాల్ మారుతోంది. గత కొన్ని ఏళ్లుగా అనేక పన్నుల పెంపులతో ఇంధన ఖర్చులు ఈ స్థాయికి చేరుకున్నాయి. రికార్డు స్థాయిలో ఇందన ధరలు పెరిగిపోవడంతో వాహనదారులు భరించలేని పరిస్థితి ఎదురవుతోంది. ముంబై వంటి ప్రధాన భారతీయ నగరాల్లో గ్యాసోలిన్ కొనాలంటే.. న్యూయార్క్ కంటే దాదాపు రెండు రెట్లు ఎక్కువ ఖర్చవుతుంది.

గత మూడేళ్లలో ముంబై గ్యాసోలిన్ ఖర్చులు 25శాతం కంటే ఎక్కువ పెరిగాయి. అదే సమయంలో డీజిల్ ధరలు మూడో వంతు పెరిగాయని ఇండియన్ ఆయిల్ కార్ప్ గణాంకాలు చెబుతున్నాయి. ధరల పెరుగుదల ద్రవ్యోల్బణ ఒత్తిళ్లను పెంచుతోంది. రాజధాని న్యూఢిల్లీలో, గ్యాసోలిన్ ధరలు ఏడాదికి దాదాపు 20శాతం పెరిగాయి. డీజిల్ ధరలు కూడా అంతే.. స్కూటర్లు, మోటారు సైకిళ్లలో గ్యాసోలిన్‌పై ఫెడరల్ పన్నులు గత ఏడు ఏళ్లలో మూడు రెట్లు ఎక్కువగా పెరిగాయి. డీజిల్‌పై కూడా ఇదే కాలంలో ఏడు రెట్లు పెరిగాయి. ఇటీవలి కాలంలో చమురు డిమాండ్ అధిక ధరలతో మధ్యతరగతిని కుదిపేస్తోంది. అయితే జూలై వరకు అధిక ధరలు ఇలానే కొనసాగితే మరింత ప్రభావం చూపే అవకాశం ఉంది.

దేశంలో ఇందన ధరలు మళ్లీ పెరిగాయి. వరుసగా మూడో రోజు ధరలు పెరిగాయి. ఆల్‌ టైమ్‌ గరిష్ఠ స్థాయికి చేరుకున్న పెట్రోల్, డీజిల్ ధరలు మరింత పైకి చేరుకున్నాయి. మంగళవారం (జూన్ 29) చమురు కంపెనీలు పెట్రోల్‌పై 35 పైసలు, డీజిల్‌పై 31 పైసలు చొప్పున పెంచేశాయి. పెరిగిన ధరలతో దేశ రాజధాని ఢిల్లీలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.98.81గా ఉండగా.. డీజిల్‌ లీటర్‌ రూ.89.18కు పెరిగింది. గత నెల నుంచి ఇప్పటి వరకు 33 సార్లు లీటర్‌ పెట్రోల్‌పై రూ.8.49 పెరగగా.. డీజిల్‌పై రూ.8.39 వరకు పెరిగింది. ముంబైలో లీటర్ పెట్రోల్ ధర 105 రూపాయలకు చేరువైంది. లీటర్ పెట్రోల్ ధర 104.90 పైసలకు చేరింది. ముంబైలో లీటర్ డీజిల్ రూ. 96.72 పైసలకు పెరిగింది.

చెన్నెలో లీటర్ పెట్రోల్ ధర సెంచరీకి చేరువైంది. చెన్నైలో పెట్రోల్ ధర 99.82 పైసలుగా ఉండగా..లీటర్ డీజిల్ ధర రూ.93.74 పైసలుగా ఉంది. కోల్‌కతాలో లీటర్ పెట్రోల్ ధర రూ.98.64 పైసలు, లీటర్ డీజిల్ ధర రూ. 92. 3 పైసలకు చేరింది. ఇక మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, రాజస్థాన్, కర్ణాటక, మణిపూర్, జమ్ము కశ్మీర్, మధ్యప్రదేశ్, ఒడిశా, లఢఖ్ లో పెట్రోల్ రేట్లు సెంచరీ దాటేశాయి. న్యూయార్క్ తో పోల్చితే ముంబైలో లీటర్ పెట్రోల్ ధర దాదాపు రెట్టింపు ధర పలుకుతోంది.