PM Modi : పెట్రోల్ ధరలు పెరుగుదల.. రాష్ట్ర ప్రభుత్వాలపై మోదీ సంచలన వ్యాఖ్యలు

పెట్రోల్ ధరల పెరుగుదలకు రాష్ట్ర ప్రభుత్వాల తీరే కారణమంటూ కీలక వ్యాఖ్యలు చేశారాయన. కేంద్రం ఎక్సైజ్ డ్యూటీ తగ్గించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నా.. రాష్ట్ర ప్రభుత్వాలు ఎక్సైజ్ డ్యూటీ...

PM Modi : పెట్రోల్ ధరలు పెరుగుదల.. రాష్ట్ర ప్రభుత్వాలపై మోదీ సంచలన వ్యాఖ్యలు

Modi

PM Modi : చమురు ధరలకు కళ్లెం పడడం లేదు. రోజురోజుకు ధరలు పెరిగిపోతుండడంతో సామాన్య, మధ్య తరగతి ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. పెట్రోల్ కు తోడుగా డీజిల్ ధరలు కూడా అధికమౌతున్నాయి. దీంతో దీనిపై ఆధార పడిన ఇతర వస్తువుల ధరలు కూడా చుక్కలంటుతున్నాయి. ఈ క్రమంలో… భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. ధరల పెరుగుదలకు కారణం ఏంటో చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వాలపై పలు విమర్శలు గుప్పించారు. పెట్రోల్ ధరల పెరుగుదలకు రాష్ట్ర ప్రభుత్వాల తీరే కారణమంటూ కీలక వ్యాఖ్యలు చేశారాయన. కేంద్రం ఎక్సైజ్ డ్యూటీ తగ్గించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నా.. రాష్ట్ర ప్రభుత్వాలు ఎక్సైజ్ డ్యూటీ ఎందుకు తగ్గించడం లేదన్నారు. ఏపీ, బెంగాల్, తమిళనాడు, మహారాష్ట్ర, తెలంగాణ, కేరళ, జార్ఖండ్ రాష్ట్రాలు పెట్రోల్ పై వ్యాట్ తగ్గించడం లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రోల్ పై వ్యాట్ తగ్గించాలని సూచించారు. అప్పుడే ప్రజలపై భారం తగ్గుతుందని తెలిపారు. కేంద్రం గత నవంబర్‌లో ఇంధన ధరలపై కేంద్రం ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించిన తర్వాత.. పన్ను తగ్గించాలని రాష్ట్రాలను అభ్యర్థించడం జరిగిందన్నారు. ఈ విషయంలో ఏ రాష్ట్రాన్ని విమర్శించాలని ఈ వ్యాఖ్యలు చేయడం లేదన్నారు.

Read More : PM Narendra Modi : 2022లో ప్రధాని మోదీ తొలి విదేశీ పర్యటన.. ఏయే దేశాల్లో ఎప్పుడంటే?

ఇతర అంశాలపై కూడా ఆయన మాట్లాడారు. వయోజన జనాభాలో 96% మంది ఫస్ట్ డోస్, 15 ఏళ్లు పైబడిన 85% మంది అర్హులు సెకండ్ డోస్ వేసుకున్నట్లు, ఇది ప్రతి పౌరుడికి గర్వకారణమన్నారు. ఇతర దేశాలతో పోలిస్తే కోవిడ్ సంక్షోభాన్ని మెరుగ్గా నిర్వహిస్తున్నా.. రాష్ట్రాల్లో కేసుల పెరుగుదల కన్పిస్తోందన్నారు. అందువల్ల అందరం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. దీని ద్వారా కోవిడ్ సవాళ్లను ఇంకా అధిగమించలేదని స్పష్టమవుతున్నట్లు.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయం చాలా ముఖ్యమని నొక్కి చెప్పారు. ఉక్రెయిన్ యుద్ధంతో అనేక సవాళ్లను ఎదుర్కొన్న చైనా సిస్టంను ప్రభావితం చేసిదని.. అందువల్ల కోఆపరేటివ్ ఫెడరలిజం మరింత ముఖ్యమనే అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ రివ్యూ మీటింగ్ మ్యాన్ పవర్, మౌలిక సదుపాయాలపై చర్చించినట్లు.. వేడిగాలుల మధ్య పెరుగుతున్న అగ్ని ప్రమాదాలను నివారించడానికి అన్ని హాస్పిటల్స్ లో భద్రతా ఆడిట్‌లకు ప్రాధాన్యత పెంచాలని రాష్ట్ర ముఖ్యమంత్రులకు సూచించారు ప్రధాని మోదీ.