Climate Change: పెరుగుతున్న సముద్ర మట్టాలతో చెన్నై, కోల్‌కతాలకు పొంచిఉన్న ముప్పు..

పర్యావరణానికి హాని కలిగించే గ్రీన్ హౌస్ ఉద్గారాలు ప్రస్తుత రీతిలో కొనసాగితే 2100 నాటికి చెన్నై, కోల్‍కతా, మయన్మార్‌లోని యాంగాన్, థాయ్‌లాండ్‌లోని బ్యాంక్, వియాత్నాంలోని హోచిమిన్ సిటీ, ఫిలిప్పీన్స్‌లోని మనీలా నగరాలకు ముంపు పొంచి ఉంటుందని శాస్త్రవేత్తలు వివరించారు.

Climate Change: పెరుగుతున్న సముద్ర మట్టాలతో చెన్నై, కోల్‌కతాలకు పొంచిఉన్న ముప్పు..

Sea

Climate Change: పెరుగుతున్న సముద్ర మట్టాల కారణంగా ఆసియాలోని పెద్ద నగరాలపై పెను‌ప్రభావం పడుతుందని తాజా పరిశోధనల్లో తేలింది. సముద్ర మట్టాల్లో సహజసిద్ధ హెచ్చుతగ్గులపై వాతావరణ మార్పులు చూపే ప్రభావం గురించి తాజా పరిశోధనలో శాస్త్రవేత్తలు పరిశీలించారు. ఉష్ణోగ్రతల్లో పెరుగుదల కారణంగా సముద్రమట్టాలు పెరుగుతున్నట్లు ఇప్పటికే వెల్లడైంది. తాజా పరిశోధనలో ప్రపంచ వాతావరణానికి సంబంధించిన కంప్యూటర్ నమూనా, ప్రత్యేక గణాంక నమూనాలతో విశ్లేషణ జరిపారు.

Climate Change: భూమిపైనే కాదు.. మార్స్‌పై కూడా వాతావరణ మార్పుల ప్రభావం

పర్యావరణానికి హాని కలిగించే గ్రీన్ హౌస్ ఉద్గారాలు ప్రస్తుత రీతిలో కొనసాగితే 2100 నాటికి చెన్నై, కోల్‍కతా, మయన్మార్‌లోని యాంగాన్, థాయ్‌లాండ్‌లోని బ్యాంక్, వియాత్నాంలోని హోచిమిన్ సిటీ, ఫిలిప్పీన్స్‌లోని మనీలా నగరాలకు ముంపు పొంచి ఉంటుందని వివరించారు. ముఖ్యంగా భారతదేశంలోని రెండు అతిపెద్ద మెట్రో నగరాల్లో తమిళనాడు రాజధాని చెన్నై, పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతా సముద్ర మట్టం ఇప్పుడు ఉన్న విధంగానే కొనసాగితే గణనీయమైన ప్రమాదం ఉందని కొత్త అంతర్జాతీయ అధ్యయనం తెలిపింది. ఈ అధ్యయనాన్ని ఎన్‌సీఏఆర్ వ్యోమింగ్ సూపర్ కంప్యూటింగ్ సెంటర్‌లో అమలు చేయబడిన అనుకరణలు, సమాజం అధిక స్థాయిలో గ్రీన్ హౌస్ వాయువులను విడుదల చేయడం కొనసాగించినట్లయితే సహజ సముద్ర మట్టం హెచ్చుతగ్గుల ప్రభావాలను పరిగణించింది.

Climate change increase mortality rate: పెరుగుతున్న రాత్రి ఉష్ణోగ్రతలు… మనుషుల ఆయుష్షు తగ్గిపోతుందని హెచ్చరిస్తున్న పరిశోధకులు

ఈ అధ్యయనం గ్లోబల్ క్లైమేట్ కంప్యూటర్ మోడల్, ప్రత్యేక గణాంక నమూనా రెండింటినీ ఉపయోగించి ప్రపంచ వ్యాప్తంగా సముద్ర మట్టం హాట్ స్పాట్‌లను మ్యాప్ చేసింది. దీంతో శాస్త్రవేత్తలు ఈ సహజ ఒడిదుడుకులు నిర్ధిష్ట తీర ప్రాంతాల వెంబడి సముద్ర మట్టం పెరుగుదల పై వాతావరణ మార్పుల ప్రభావాన్ని ఎంత వరకు పెంచగలుగుతాయో, తగ్గించగలవో గుర్తించగలిగారు. అయితే, అంతర్గత వాతావరణ వైరుధ్యాల కారణంగా కొన్ని ప్రాంతాల్లో సముద్రమట్టాలు 20-30 శాతం పెరుగుతాయని, ఫలితంగా వరద ముప్పు మరింత పెరుగుతుందని అధ్యయనంలో తేలింది. 2006తో పోలిస్తే 2100లో మనీలాలో తీర ప్రాంతంలో వరద ఘటనలు 18 రెట్లు పెరుగుతాయని వివరించారు. విత్కర పరిస్థితుల్లో అవి 96రెట్లు పెరిగే అవకాశం ఉన్నట్లు అధ్యయనంలో తేలింది.