Omicron : ఒమిక్రాన్ తో తీవ్ర ముప్పు..ప్రపంచదేశాలకు WHO హెచ్చరిక

దక్షిణాఫ్రికాలో తాజాగా వెలుగుచూసిన కోవిడ్ కొత్త వేరియంట్ "ఒమిక్రాన్"తో వ్ర ముప్పు పొంచి ఉందని WHO(ప్రపంచ ఆరోగ్య సంస్థ) హెచ్చరించింది. ఒమిక్రాన్‌లోని స్పైక్‌ ప్రొటీన్‌లో 26 నుంచి 32

Omicron :  ఒమిక్రాన్ తో తీవ్ర ముప్పు..ప్రపంచదేశాలకు WHO హెచ్చరిక

Who

Omicron: దక్షిణాఫ్రికాలో తాజాగా వెలుగుచూసిన కోవిడ్ కొత్త వేరియంట్ “ఒమిక్రాన్”తో వ్ర ముప్పు పొంచి ఉందని WHO(ప్రపంచ ఆరోగ్య సంస్థ) హెచ్చరించింది. ఒమిక్రాన్‌లోని స్పైక్‌ ప్రొటీన్‌లో 26 నుంచి 32 వరకూ ఉత్పరివర్తనాలు ఉన్నాయని.. వాటిలో కొన్నింటికి రోగ నిరోధక వ్యవస్థను తప్పించుకునే సామర్థ్యం, వేగంగా వ్యాపించే లక్షణం ఉందని డబ్ల్యూహెచ్ వో తెలిపింది. ఒమిక్రాన్‌కు ఉన్న లక్షణాలతో రాబోయే రోజుల్లో కొవిడ్ కేసుల సంఖ్య పెరిగే అవకాశముందని, అదే జరిగితే తీవ్ర పరిణామాలకు దారితీయవచ్చని WHO ఒక టెక్నికల్ నోట్ లో పేర్కొంది.

మునుపటి ఇన్‌ఫెక్షన్ల నుంచి, వ్యాక్సిన్‌ల ద్వారా సంక్రమించిన రోగనిరోధకశక్తిని తప్పించుకునే విషయంలో ఒమిక్రాన్ సామర్థ్యం అంచనావేసేందుకు మరిన్ని పరిశోధనలు అవసరమని ప్రపంచ ఆరోగ్యసంస్థ అభిప్రాయపడింది. అయితే ఇప్పటి వరకు, ఒమిక్రాన్ వేరియంట్‌ కారణంగా ఎలాంటి మరణాలు సంభవించలేదని WHO తెలిపింది.

అయితే ఇప్పటి వరకు, ఒమిక్రాన్ వేరియంట్‌ కారణంగా ఎలాంటి మరణాలు సంభవించలేదని WHO తెలిపింది. కేసుల్లో పెరుగుదల, తీవ్రతలో మార్పు కారణంగా ఆరోగ్య రంగ వ్యవస్థలపై భారం పడే అవకాశముందని పేర్కొంది. అనారోగ్యానికి గురయ్యే వారి సంఖ్య పెరగడంతో పాటు మరణాలు సైతం అధికంగా నమోదయ్యే అవకాశముందని.. వ్యాక్సినేషన్ నెమ్మదిగా సాగుతున్న దేశాలపై ప్రభావం పడే అవకాశముందని WHO అంచనావేసింది. ఈ నేపథ్యంలో వ్యాక్సినేషన్ వేగవంతం సహా ఆరోగ్య రంగ వ్యవస్థలను బలోపేతం చేసుకోవాలని ప్రపంచ దేశాలకు సూచించింది.

ALSO READ Omicron : ఒమిక్రాన్ ముప్పు.. ఏపీ ప్రభుత్వం అప్రమత్తం.. సీఎం జగన్ కీలక ఆదేశాలు

ALSO READ ‘ఓమిక్రాన్’ వైరస్ లక్షణాలివే..!