పెరిగిన ఆయిల్ ధరలు..అసెంబ్లీకి సైకిల్‌పై వచ్చిన ఎమ్మెల్యే

పెరిగిన ఆయిల్ ధరలు..అసెంబ్లీకి సైకిల్‌పై వచ్చిన ఎమ్మెల్యే

RJD MLA పెట్రోల్, డీజిల్ ధరలు వరుసగా పదకొండవ రోజు కూడా పెరగడంతో సామాన్య ప్రజానీకంతో పాటు ప్రజా ప్రతినిదులు కూడా వివిధ పద్ధతుల్లో తమ నిరసనలు తెలియజేస్తున్నారు. పెట్రో ధరల పెరుగుదలను నిరసిస్తూ బిహార్‌లోని మహువా నియోజకవర్గ ఆర్జేడీ ఎమ్మెల్యే ముకేశ్‌ రౌషన్‌ వినూత్న రీతిలో నిరసన తెలిపారు.

తాజాగా బీహార్‌లో బడ్జెట్ సెషన్ ప్రారంభం కావడంతో అసెంబ్లీ మొదటి రోజున ఎమ్మెల్యే ముఖేష్ రౌషన్ అసెంబ్లీకి సైకిల్‌ తొక్కుకుంటూ వచ్చారు. హాజీపూర్‌ నుంచి రాజధాని పట్నా లోని అసెంబ్లీ వరకు సైకిల్‌పై వచ్చి నిరసన వ్యక్తం చేశారు. ఉదయం 7 గంటలకు అక్కడి నుంచి బయల్దేరిన ఆయన దాదాపు 5 గంటలపాటు సైకిల్‌ తొక్కి అసెంబ్లీకి చేరుకున్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే ముకేశ్‌ రౌషన్‌ మీడియాతో మాట్లాడుతూ.. ప్రస్తుతం ఇంధన ధరలు భారీగా పెరగడంతో రాష్ట్రంలో ఏది కొనే పరిస్థితి లేదు. నిత్యావసరాల ధరలు తారాస్థాయి చేరాయని, సామాన్యుడికి రోజు గడవడం కష్టంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే బీహార్‌లో నేరాలు తారాస్థాయికి చేరుకున్నాయి. అసెంబ్లీ సమావేశాల్లో వీటన్నింటిపై ప్రభుత్వాన్ని నిలదీస్తామని ఆయన తెలిపారు.