Cuddalore Accident: తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి

కడలూరు జిల్లా వేపూర్ సమీపంలోని అయ్యనార్ పాళయం ప్రాంతంలో ప్లైఓవర్ నిర్మాణం జరుగుతోంది. ఈ క్రమంలో అక్కడ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఈ ట్రాఫిక్ లో ఇరుక్కుపోయిన కారును వేగంగా వచ్చిన ఇసుక లారీ ఢీకొట్టింది. దీంతో కారు ముందున్న లారీని ఢీకొట్టడంతో రెండు లారీల మధ్య కారు నుజ్జునుజ్జయింది.

Cuddalore Accident: తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి

Cuddalore Accident: తమిళనాడులో ఘోర రోడ్డుప్రమాదం చోటు చేసుకుంది. కడలూరు జిల్లాలో వేపూర్ సమీపంలో చెన్నై – తిరుచ్చి జాతీయ రహదారిపై మంగళవారం తెల్లవారు జామున ఈ ప్రమాదం చోటు చేసుకుంది.  రెండు ప్రైవేట్ బస్సులు, ఒక కారు, రెండు లారీలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ రోడ్డుప్రమాదంలో ఐదుగురు మరణించారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు, ఇద్దరు మహిళలు ఉన్నారు. మృతులంతా కారులో ప్రయాణిస్తున్నవారే. వారంతా ఒకే కుటుంబానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు.

Road Accident Two Dead : బంజారాహిల్స్ లో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి

అర్థరాత్రి 2గంటల సమయంలో ఈ ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. కడలూరు జిల్లా వేపూర్ సమీపంలోని అయ్యనార్ పాళయం ప్రాంతంలో ప్లైఓవర్ నిర్మాణం జరుగుతోంది. ఈ క్రమంలో అక్కడ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఈ ట్రాఫిక్ లో ఇరుక్కుపోయిన కారును వేగంగా వచ్చిన ఇసుక లారీ ఢీకొట్టింది. దీంతో కారు ముందున్న లారీని ఢీకొట్టడంతో రెండు లారీల మధ్య కారు నుజ్జునుజ్జయింది. ఈ ప్రమాద సమయంలో ఓ ప్రైవేట్ బస్సు వేగంగా వచ్చి లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులోని ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు.

 

 

సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలికి చేరుకుని ట్రాఫిక్ ను క్లియర్ చేశారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. ప్రమాదంలో కారు నుజ్జునుజ్జు కావటంతో మృతదేహాలను బయటకు తీసేందుకు సుమారు రెండుగంటలపాటు సమయం పట్టింది. కారులోని ఆర్‌సీ బుక్ ఆధారంగా పోలీసులు వివరాలు సేకరించారు. కాంచీపురం జిల్లా నంగనల్లూరు ప్రాంతానికి చెందిన వారిగా గుర్తించారు. అయితే వీరు ఓ ప్రైవేట్ హోటల్‌లో బసచేసిన రసీదును కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రమాదంపై పూర్తి వివరాలు తెలుసుకొనేందుకు విచారణ చేపట్టారు.