Katrina Kaif Cheeks: రోడ్లను కత్రినా కైఫ్ బుగ్గల్లా రెడీ చేయండి – మంత్రి

రాజస్థాన్ మంత్రి మండలిలో రీసెంట్ గా చోటు దక్కించుకున్న రాజేంద్ర సింగ్ గూడ కామెంట్లు వైరల్ అయ్యాయి. పంచాయతీ రాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ మంత్రిగా బాధ్యతలు అందుకున్న ఆయన.. తమ పరిధిలో

10TV Telugu News

Katrina Kaif: రాజస్థాన్ మంత్రి మండలిలో రీసెంట్ గా చోటు దక్కించుకున్న రాజేంద్ర సింగ్ గూడ కామెంట్లు వైరల్ అయ్యాయి. పంచాయతీ రాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ మంత్రిగా బాధ్యతలు అందుకున్న ఆయన.. తమ పరిధిలో ఉన్న రోడ్లను కత్రినా కైఫ్ బుగ్గల్లా తీర్చి దిద్దుతామని హామీ ఇచ్చారు.

ఝన్‌ఝును జిల్లాలో మంగళవారం జరిగిన ఈవెంట్ లో పాల్గొన్న ఆయన.. హేమ మాలినికి వయసైపోయిందని యువ యాక్టెర్లెవరని సలహా అడిగి.. కత్రినా కైఫ్ పేరు మీద కామెంట్ చేశారు.

2018 అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన ఆరుగురు ఎమ్మెల్యేల్లో గూడ ఒకరు. బీఎస్పీ టికెట్ పై గెలిచి కాంగ్రెస్ లోకి జంప్ అయ్యారు.

……………………………… : కాంగ్రెస్‌కు భారీ షాక్.. పార్టీని వీడిన 12 మంది ఎమ్మెల్యేలు

*
పొలిటీషియన్స్ రోడ్లను సినీతారల బుగ్గలతో పోల్చడం తొలిసారి కాదు. 2005లో ఆర్జేడీ అధినేత లాలూప్రసాద్‌ యాదవ్‌ కూడా రహదారుల్ని హేమమాలిని బుగ్గల్లా నున్నగా చేస్తానంటూ హామీ ఇచ్చారు.

*
మధ్యప్రదేశ్‌ న్యాయశాఖ మంత్రి పీసీ శర్మ కూడా 2019లో తమ రాష్ట్రంలో గుంతలమయమైన రోడ్లను సుందరంగా.. ‘డ్రీమ్‌గర్ల్‌’ స్టార్‌ బుగ్గల్లా మారుస్తామంటూ వ్యాఖ్యానించారు.

*
2013లో యూపీలో ఖాదీ, గ్రామీణ పరిశ్రమల మంత్రి రాజారాం పాండే ప్రతాప్‌గఢ్‌ జిల్లాలో రహదారులను సినీతారలు హేమమాలిని, మాధురీ దీక్షిత్‌ బుగ్గల్లా నిర్మిస్తామంటూ చెప్పారు.

*
అదే సంవత్సరం ఛత్తీస్‌గఢ్‌లో భాజపా నేత, మంత్రి బ్రిజ్‌మోహన్‌ అగర్వాల్‌ కూడా తమ రాష్ట్ర రహదారులను హేమమాలిని బుగ్గలతో పోల్చడం అప్పట్లో చర్చనీయాంశమైంది.