Robbers ‘I LOVE YOU’ Message : ఇల్లంతా దోచేసి..‘ఐ లవ్ యూ’అని రాసిన దొంగలు..

‘ఐ లవ్ యూ’ అని రాసి ఇల్లంతా దోచేసారు దొంగలు..వార్నీ.. నా ఇల్లంతా దోచుకుపోయి నాకే ఐ లవ్ యూ అని చెబుతార్రా అంటూ ఆశ్చర్యపోయాడా యజమాని..

Robbers ‘I LOVE YOU’ Message : ఇల్లంతా దోచేసి..‘ఐ లవ్ యూ’అని రాసిన దొంగలు..

Robbers ‘i Love You’ Message In Goa

Robbers ‘I LOVE YOU’ Message : ఇంట్లో దొంగలు పడితే ఏం చేస్తారు? అంటే ఇదేం పిచ్చి ప్రశ్న? ఇల్లంతో ఊడ్చుకని విలువైన వస్తువుల్నీ దోచుకుపోతారు అని చెబుతారు ఎవరైనా సరే. కానీ ఓ ఇంట్లో చొరబడిన దొంగలు మాత్రం ఇల్లంతా దోచేసుకుని వెళుతూ వెళుతూ ఓ కొంటె పనిచేశారు. గోవాలోని మార్గోవో పట్టణంలో ఒక ఇంట్లో దొంగలు పడ్డారు.  బంగారు ఆభరణాలు, రూ.1.5 లక్షల నగదు చోరీ చేశారు. తరువాత తాపీగా బయటకు వెళ్లిపోతూ టీవీ సెట్ మీద ‘ఐ లవ్ యూ’ అని రాసి మరీ వెళ్లిన వైనం చూసి వార్నీ నా ఇల్లంతా దోచేసుకుని నాకే ఐ లవ్ యూ అని రాసిపోతార్రా అనుకుని ఇంటి యజమాని ఆశ్చర్యపోయాడు.

గోవాలోని మార్గోవో సిటీలో నివసించే అసిబ్ జెక్‌ అనే వ్యక్తి సోదరుడి పెళ్లి విందు మంగళవారం (మే 24,2022) జరిగింది. ఆ వివాహ విందుకు ఆ ఇంటి వారంతా రిసెప్షన్‌ జరిగే ఫంక్షన్‌ హాల్‌కు వెళ్లారు. తిరిగి మధ్యాహ్నం ఒంటి గంటకు తిరిగి ఇంటికి చేరుకున్నారు. తాళం తీసి ఇంట్లోకి వచ్చినవారు ఆశ్చర్యపోయారు.

ఇంట్లో వస్తువులు చిందర వందరగా పడి ఉండటంతో దొంగతనం జరిగినట్లు గ్రహించి ఆందోళన పడ్డారు. బాత్‌ రూమ్‌ కిటికీ గ్రిల్‌ తొలగించి ఉండటంతో దొంగలు అక్కడి నుంచి ఇంట్లోకి చొరబడినట్లుగా ఇంటి యజమానికి తెలిసింది. బంగారు ఆభరణాలు, రూ.1.5 లక్షల నగదు చోరీ అయినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అలాగే చోరీ అనంతరం దొంగలు ఆ ఇంట్లోని టీవీ సెట్‌పై ‘ఐ లవ్ యూ’ అని అని మార్కర్‌తో రాసినట్లు పోలీసులకు చెప్పారు.కాగా, ఆ ఇంటికి వచ్చిన పోలీసులు చోరీ జరిగిన తీరును పరిశీలించారు. డాగ్‌ స్క్వాడ్‌, ఫింగర్‌ ప్రింట్‌ నిఫుణులను రప్పించి ఆధారాలు సేకరించారు. ఈ దొంగతనంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.