Mohali: పోలీస్ ఇంటెలిజెన్స్ కార్యాలయంపై రాకెట్ దాడి ఘటనలో దర్యాప్తు వేగవంతం.. రంగంలోకి ఎన్ఐఏ

మొహాలీలోని పంజాబ్ పోలీస్ ఇంటెలిజెన్స్ కార్యాలయంలో అనుమానాస్పద పేలుడు చోటు చేసుకున్న విషయం విధితమే. ఇంటెలిజెన్స్ హెడ్ క్వార్టర్స్‌లోని ఓ భవనం లక్ష్యంగా రాకెట్ ఆధారిత గ్రెనేడ్ విసిరినట్లు తెలిసింది. సోమవారం...

Mohali: పోలీస్ ఇంటెలిజెన్స్ కార్యాలయంపై రాకెట్ దాడి ఘటనలో దర్యాప్తు వేగవంతం.. రంగంలోకి ఎన్ఐఏ

Grenade Attack

Mohali: మొహాలీలోని పంజాబ్ పోలీస్ ఇంటెలిజెన్స్ కార్యాలయంలో అనుమానాస్పద పేలుడు చోటు చేసుకున్న విషయం విధితమే. ఇంటెలిజెన్స్ హెడ్ క్వార్టర్స్‌లోని ఓ భవనం లక్ష్యంగా రాకెట్ ఆధారిత గ్రెనేడ్ విసిరినట్లు తెలిసింది. సోమవారం రాత్రి 7.45గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. ఈ ఘటనలో కిటీకీ అద్దాలు ధ్వంసమయ్యాయి. తృటిలో ప్రాణనష్టం తప్పింది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిసర ప్రాంతాలను తమ ఆధీనంలోకి తీసుకొని భద్రతను కట్టుదిట్టం చేశారు. అయితే రాకెట్‌తో నడిచే గ్రెనేడ్‌ను 80మీటర్ల దూరం నుంచి కాల్చినట్లు పోలీసులు తెలిపారు.

Afghanistan bomb blast : అఫ్ఘానిస్థాన్ లో మరోసారి బాంబు దాడి..33 మంది మృతి

ఇద్దరు అనుమానితులు కారులో వచ్చి ఈ దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. అయితే ఇంటెలిజెన్స్ కార్యాలయంపై దాడి ఘటనలో దర్యాప్తు చేపట్టేందుకు ఎన్ఐఏ (జాతీయ దర్యాప్తు సంస్థ) రంగంలోకి దిగింది. స్థానికంగా ఉన్న సీసీటీవీ ఫుటేజీని అధికారులు పరిశీలించి దర్యాప్తును ముమ్మరం చేశారు. రాకెట్ లాంచర్‌ను డ్రోన్ ద్వారా డెలివరీ చేసి ఉండవచ్చునని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఉగ్రవాదులు గత కొన్ని నెలలుగా పాకిస్థాన్ నుండి పంజాబ్‌లోకి ఆయుధాలు, పేలుడు పదార్థాలను రవాణా చేయడానికి డ్రోన్ లను వాడుతున్నారు.

ఇదిలా ఉంటే ఈ ఘటనపై పంజాబ్‌ ముఖ్యమంత్రి భగవంత్‌ సింగ్‌ మాన్‌ పోలీసు ఉన్నతాధికారులను సమగ్ర నివేదిక కోరారు. మాజీ సిఎం, పంజాబ్ లోక్ కాంగ్రెస్ అధ్యక్షుడు కెప్టెన్ అమరీందర్ సింగ్ ఈ సంఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పోలీసు బలగాలపై జరిగిన ఈ దాడి తీవ్ర ఆందోళన కలిగిస్తుందని అతను ఒక ట్వీట్‌లో పేర్కొన్నాడు. ఇదే విషయంపై శిరోమణి అకాలీదళ్ అధ్యక్షుడు, మాజీ డిప్యూటీ సిఎం సుఖ్‌బీర్ బాదల్ మాట్లాడుతూ.. పేలుడు తీవ్రమైన భద్రతా లోపాలను బహిర్గతం చేసిందని, పంజాబ్‌లో మరోసారి క్షీణిస్తున్న శాంతిభద్రతలను ఈ ఘటన తెరపైకి తెచ్చిందని అన్నారు. బాధ్యులను గుర్తించి, శిక్షించడానికి సమగ్ర విచారణ అవసరం అని బాదల్ అన్నారు.