ఫొని బీభత్సం…గ్రామాలను ముంచెత్తిన సముద్రపు నీరు

  • Published By: venkaiahnaidu ,Published On : May 3, 2019 / 07:11 AM IST
ఫొని బీభత్సం…గ్రామాలను ముంచెత్తిన సముద్రపు నీరు

ఒడిషాలోని పూరీ దగ్గర తీరం దాటింది ఫొని తుఫాన్. తీరం దాటే సమయంలో 200 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు బీభత్సం చేశాయి. సముద్రంంలో అలలు భీకరంగా ఎగసిపడ్డాయి.ఈదురుగాలుల బీభత్సంతో ఒడిషా రాజధాని భువనేశ్వర్ ప్రాంతంలో చెట్లు నేలకొరిగాయి. పలు చోట్ల పోలీసులు,స్థానికులు స్వచ్చందంగా ముందుకొచ్చి రోడ్లపై పడిపోయిన చెట్లను తొలగించారు.

మరోవైపు భద్రక్ సిటీలో సముద్రం అల్లకల్లోలంగా మారింది. సముద్రం ముందుకువచ్చింది. ఒడ్డున ఉన్న గ్రామాలను సముద్రపు నీరు ముంచెత్తింది. మరోవైపు భద్రక్-విజయనగరం సెక్షన్ లో అన్ని రైళ్లను శనివారం వరకు అధికారులు సస్పెండ్ చేశారు. మొత్తం 140 రైళ్లను రద్దు చేయగా అందులో 83 ప్యాసింజర్ రైళ్లు ఉన్నాయి. భువనేశ్వర్, కోల్ కతా  ఎయిర్ పోర్ట్ లను కూడా మూసివేశారు.