ఎవరైనా కరోనా వారియర్స్ చనిపోతే…వారి కుటుంబాలకు 1కోటి ఇస్తామన్న కేజ్రీవాల్

  • Published By: venkaiahnaidu ,Published On : April 1, 2020 / 09:30 AM IST
ఎవరైనా కరోనా వారియర్స్ చనిపోతే…వారి కుటుంబాలకు 1కోటి ఇస్తామన్న కేజ్రీవాల్

కరోనా వైరస్ సోకిన పేషెంట్లకు సేవలు చేస్తున్న సమయంలో మెడికల్ స్టాఫ్ ఎవరైనా… డాక్టర్లు కానీ,నర్సులు కానీ,శానిటైజేషన్ వర్కర్లు కానీ ఇతర హెల్త్ సిబ్బంది ఎవరైనా ప్రాణాలు కోల్పోతే వారి  కుటుంబాలకు 1కోటి రూపాయలను ఇవ్వనున్నట్లు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. ప్రాణాలు కోల్పోయిన హెల్త్ సిబ్బంది సేవలకు గౌరవసూచకంగా వాళ్ల కుటుంబాలకు 1కోటిరూపాయలు ఇవ్వబడతాయని కేజ్రీవాల్ సృష్టంచేశారు.

ప్రాణాలు కోల్పోయిన హెల్త్ సిబ్బంది..ప్రేవేటు సెక్టార్ కు చెందినవారా లేదా ప్రభుత్వ సెక్టార్ కు చెందినవారా అన్నది అసలు విషయం కాదని,ప్రాణాలు కోల్పోయిన ప్రతి ఒక్క హెల్త్ సిబ్బంది కుటుంబానికి నగదు అందించనున్నట్లు తెలిపారు. హెల్త్ సిబ్బంది సైనికులకన్నా తక్కువ కాదని ఆయన తెలిపారు.

క‌రోనా వైరస్(కోవిడ్-19) బాధితుల కోసం నిర్విరామంగా కృషిచేస్తున్న డాక్ట‌ర్ల ఆరోగ్యం దృష్ట్యా ఢిల్లీ ప్రభుత్వం సోమవారం కీలక నిర్ణయం తీసుకుంది. ఢిల్లీలో ప్రభుత్వ హాస్పిటల్స్ అయిన లోక్ నాయక్ హాస్పిటల్ మరియు GB పంత్ హాస్పిటల్స్ లో కోవిడ్-19 డ్యూటీలో పనిచేస్తున్న డాక్టర్లను ల‌లిత్ హోట‌ల్‌లో ఉంచ‌నున్న‌ట్లు కేజ్రీవాల్ ప్ర‌భుత్వం సోమవారం(మార్చి-30,2020) ప్ర‌క‌టించిన విషయం తెలిసిందే.